Begin typing your search above and press return to search.

జన సైనిక్స్ హర్ట్ : పవన్ మీద ఇండైరెక్ట్ గా బాబు...?

By:  Tupaki Desk   |   18 Nov 2022 3:59 PM GMT
జన సైనిక్స్ హర్ట్ : పవన్ మీద ఇండైరెక్ట్ గా బాబు...?
X
చంద్రబాబు రాజకీయం ఎపుడూ చిత్రంగా ఉంటుంది. ఆయన అవసరం ఉంటే పొగుడుతారు. ఎన్ని మెట్లు అయినా దిగి వస్తారు. అదే బాబు అవసరం లేకపోయినా అవతల వారు తమ వైపు చూడరు అని తెలిసిన వెంటనే టోన్ మార్చేస్తారు అని విమర్శలు ఉన్నాయి. దాన్ని గుర్తి చేసేలా ఆయన లేటెస్ట్ కర్నూల్ టూర్ లో చేసిన కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

అదేంటి అంటే మూడు రోజుల కర్నూల్ టూర్ లో భాగంగా బాబు ఎమ్మిగనూర్ లో రోడ్ షో చేశారు. అక్కడ జనం ఇసుక వేస్తే రాలనంతంగా వచ్చారు. దాంతో ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బు అయిన చంద్రబాబు ఇంతకాలం మీరు ఇళ్ళలోనే ఉన్నారు. కానీ ఇపుడు వైసీపీ ప్రభుత్వం మీద విసిగి ఇలా రోడ్ల మీదకు వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు.

అంతే కాదు మీరు నన్ను చూడడానికి నేను ఏమైనా సినినా యాక్టర్ నా అని ఆయన ప్రశ్నించారు. నా సినిమా ఈ మధ్య రిలీజ్ అయి హిట్ అయింది ఏమైనా ఉందా. నాలో ఏమీ ఆకర్షణ లేకపోయినా మీరు వచ్చారు అంటే తప్పకుండా ఇది ప్రజా వ్యతిరేకత, అలాగే టీడీపీ పట్ల అనుకూలత అని బాబు తనదైన భాష్యం చెబుతూ మాట్లాడారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ బాబు ఈ మధ్యలో యాక్టర్ సినిమా హిట్లు తీసుకురావడం వల్లనే ఇబ్బంది వచ్చి పడింది. పవర్ స్టార్ గా సినీ హీరోగా పవన్ ఉన్నారు. ఆయన సభలకు జనాలు పోటెత్తుతున్నారు. పైగా పవన్ ఈ మధ్య బీజేపీతో కలసి ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ మధ్యనే నరేంద్ర మోడీని విశాఖలో భేటీ వేసి వచ్చారు.

దీని తరువాత జనసేన టీడీపీ పొత్తు పూర్తిగా డైలామాలో పడింది. ఆ విషయం బాబు కంటే ఎవరికీ తెలిసే చాన్సే లేదు అందుకే ఆయన ఇండైరెక్ట్ గా పవన్ని ఉద్దేశించి యాక్టర్ ని నేను కాదు అని అనిఉంటారని అంటున్నారు. అంటే ఆయన మాటలలో రెండు విషయాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి తనలో ఎలాంటి సినీ గ్లామర్ లేకపోయినా జనాలు వచ్చారని, అది టీడీపీ మీద తన మీద జనాలు చూపించే నిఖార్సు అయిన అభిమానం అని అర్ధంగా చెప్పుకోవాలి.

మరోటి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సభలకు జనాలు విరగబడి వస్తున్న అదంతా కేవలం సినీ గ్లామర్ తప్ప రాజకీయంగా ఏమీ కాదు అంటూ లైట్ తీసుకోవడం కూడా అంటున్నారు. మొత్తానికి అర్ధం పరమార్ధం ఏమిటో ఎవరికి తెలియకపోయినా బాబు వ్యాఖ్యలతో మాత్రం జనసైనికులు హర్ట్ అయ్యారు. వారు బాబు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

ఈ రకంగా మాట్లాడడమా అని కూడా ఫైర్ అవుతున్నారుట. నిజానికి టీడీపీతోనే కలసి వెళ్లాలని నిన్నటిదాకా జనసైనికులు కూడా చాలా మంది అనుకుని ఉండొచ్చు. కానీ ఒక దేశ ప్రధాని పవన్ కి రెడ్ కార్పెట్ పరచి ఆయనకు అత్యంత విలువ గౌరవం ఇవ్వడంతో జనసైనికులు పొంగుతున్నారని అంటున్నారు. దాంతో వారు ఇపుడు బాబు కామెంట్స్ లో తప్పు పట్టుకుంటున్నారు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా యాక్టర్ ని కాను అని బాబు అన్నది ఎవరిని ఉద్దేశించి అంటే ఎవరికి వారే జవాబు చెప్పుకోవాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.