Begin typing your search above and press return to search.
వైసీపీ మూకలపై తిరగబడండి.. ఫస్ట్‌టైమ్.. చంద్రబాబు పిలుపు!
By: Tupaki Desk | 12 Oct 2022 2:14 PM GMTవైసీపీ ప్రభుత్వ విధానాలు.. నేతల దూకుడుపై ఇప్పటి వరకు..చంద్రబాబు పోరాడిన విధానం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన ఫస్ట్ టైమ్.. వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలపై తిరగబడాలని.. టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖను మింగేసి.. ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైసీపీ మూకకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
విశాఖను కొల్లగొట్టి... కంపెనీలను వెళ్లగొట్టిన వాళ్లు అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సేవ్ ఉత్తరాంధ్ర' పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు టీడీపీ నిలబ డాలని సూచించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్లు, ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉన్నాయనే ఆలోచనతో నేతలు సిద్ధం కావాలని, నియోజకవర్గంలో గెలుస్తామనే నమ్మకం కల్పించాల్సింది స్థానిక నాయకులే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తన నిర్ణయాలు ఉంటాయని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో నష్టపోని వర్గం అంటూ లేదని... ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పార్టీ అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు.
మూడు రాజధానులు అంటూ జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెపుతున్నా... ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధానులు అంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇంచార్జ్లు గట్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
బోల్డ్గా ఉండే బాలకృష్ణ శైలి కారణంగానే టాక్ షో.. అన్‌స్టాపబుల్-2 అంత హిట్ అయ్యిందని చంద్రబాబు పేర్కొన్నారు. నాటి అధికార మార్పిడి విషయంలో వాస్తవంగా జరిగింది ఏంటి అనేది ఆ షోలో చర్చకు వచ్చిందని తెలిపారు. దశాబ్దాలుగా బురద వేస్తున్న అంశంలో ఓపెన్గా పలు విషయాలు మాట్లాడానని నేతలకు ఈ సందర్భంగా ఆయన వివరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.