Begin typing your search above and press return to search.

బాబుకు గ‌ట్టి దెబ్బ త‌గ‌లుతోందా?

By:  Tupaki Desk   |   26 May 2021 2:30 PM GMT
బాబుకు గ‌ట్టి దెబ్బ త‌గ‌లుతోందా?
X
టీడీపీ ప‌రిస్థితి రానురానూ మ‌రింత దారుణంగా త‌యారైపోతోంది. ఓ వైపు అధికార ప‌క్షం నుంచి వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. మ‌రోవైపు.. సొంత పార్టీ నుంచి కూడా త‌ల‌నొప్పులు వ‌చ్చిప‌డుతున్నాయి. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ప్ర‌తిసారీ కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతూనే ఉంది.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌గిలిన భారీ దెబ్బ నుంచి కోలుకోవ‌డానికి చంద్ర‌బాబుకు చాలా స‌మ‌యం ప‌ట్టింది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో, ఆ త‌ర్వాత మునిసిప‌ల్ పోరులోనూ సైకిల్ పంక్ఛ‌ర్ అయిపోయింది. పంచాయ‌తీల్లో 85 శాతానికిపైగా, మునిసిపాలిటీల్లో 90 శాతానికిపైగా స్థానాలు గెలుచుకున్న అధికార పార్టీ.. తిరుగులేని ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. ఆ విధంగా జ‌గ‌న్ త‌న‌కు తిరుగులేద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. జ‌నం త‌మ ప‌క్షాన్నే ఉన్నార‌ని చాటుకుంటున్నారు.

దీంతో.. వైసీపీని ఎలా ఎదుర్కోవాలో అర్థంగాక స‌త‌మ‌తం అవుతున్న చంద్ర‌బాబుకు.. ఇంటి లొల్లి ఎక్కువైపోయింది. ఓవైపేమో ఎన్ని జాకీలు పెట్టి లేపినా.. లోకేష్ ను భావినేత‌గా గుర్తించ‌ట్లేదు పార్టీలోని చాలా మంది. మ‌రోవైపేమో చంద్ర‌బాబు సీనియ‌ర్ సిటిజ‌న్ అయిపోయాడు అంటూ రెస్ట్ తీసుకోవాల‌నే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితులతో అవ‌స్థ‌లు ప‌డుతున్న బాబుకు.. కొంద‌రు సైకిల్ దిగిపోవ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌డం.. మూలిగేన‌క్క‌పై తాంటిపండు ప‌డ్డ చందంగా త‌యార‌వుతోంది.

ఇప్ప‌టికే న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీ చెంత‌న చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ నీరుగారిపోవడంతోనే మ‌రికొంత‌మంది వైసీపీతో ట‌చ్ లో వెళ్లార‌న్న వార్త‌లు గుప్పు మ‌న్నాయి. తాజాగా.. తిరుప‌తి ఉప ఎన్నిక త‌ర్వాత ప‌న‌బాక ల‌క్ష్మి కూడా అధికార పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌న్న వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ మేర‌కు గ్రౌండ్ వ‌ర్క్ ప్రిపేర్ అవుతోంద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి గ‌తంలోనే వైసీపీ నుంచి ప‌న‌బాక ల‌క్ష్మికి ఆఫ‌ర్ ఉంద‌ని చెబుతారు. కానీ.. ఆమే వేరే కార‌ణాల‌తో వెళ్ల‌లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇప్పుడు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. ఇక‌, టీడీపీలో ఉంటే లాభం లేద‌నే నిర్ణ‌యానికి ఆమె వ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు. అందుకే.. సైకిల్ దిగేయాల‌ని డిసైడ్ అయ్యార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ మేర‌కు వైసీపీతో రాయ‌భారాలుకూడా న‌డిచాయ‌ని అంటున్నారు. కేవ‌లం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే మాత్ర‌మే మిగిలి ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి, ప‌న‌బాక వెళ్తున్నారా? జ‌గ‌న్ అంగీక‌రిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది.