Begin typing your search above and press return to search.
పరిశ్రమలు పోతుంటే.. వైసీపీకి బాధ లేదా? : చంద్రబాబు క్వశ్చన్
By: Tupaki Desk | 3 Dec 2022 3:30 PM GMTఏపీ నుంచి పరిశ్రమలు ఒక్కొక్కటిగా పోతుంటే.. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పరిశ్రమల కోసం రాష్ట్రాలు పోటీపడుతున్నాయని చెప్పిన చంద్రబాబు ఏపీ ప్రభుత్వం మాత్రం పరిశ్రమలను, కంపెనీలను తరిమి కొడుతోందని వ్యాఖ్యానించారు. పొలిటికల్‌గా ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన , వస్తున్న ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. ఫలితంగా ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ అదికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయంగా వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రతిష్ఠ, సామర్థ్యం వంటివి పూర్తిగా దెబ్బతింటున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఉద్యోగావకాశాలు, ఆర్థిక వ్యవస్థ రెండూ దెబ్బతినిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేసి ఎవరిని ఉద్ధరిస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇండస్ట్రీల కోసం రాష్ట్రాలు పోటా పోటీగా పోటీ పడుతున్నాయని చెప్పారు. కానీ, దీనికి విరుద్ధంగా ఏపీలోని వైసీపీ ప్రబుత్వం మాత్రం పోటీ పడకపోగా.. వచ్చిన అవకాశాలను కూడా వదులు కుంటోందని అన్నారు. పరిశ్రమలకు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడం, వారిని వేధించడం, యాజమాన్యాలకు ఇచ్చిన అనుమతులు నిరాకరించడం వంటి చర్యలతో కంపెనీలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు ఎన్నో ఆశలతో 2019లో జగన్‌కు అధికారం ఇచ్చారని తెలిపిన చంద్రబాబు.. వారి ఆశలను అడియాసలు చేసిన జగన్.. క్షమించరాని తప్పులు చేశాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి రూపంలో ఉన్న ఈ రాక్షసుడు అని జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ ఒక చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
రాయలసీమలో 40 ఏళ్ల కాలంలో దాదాపు లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి, రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిన అమర్రాజా కంపెనీని నేడు తరిమేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించుకోవాలని.. జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.