Begin typing your search above and press return to search.

బాబు పిలుపు ఇచ్చారు... క‌దిలిన త‌మ్ముళ్లెంద‌రు?

By:  Tupaki Desk   |   25 Dec 2022 1:30 PM GMT
బాబు పిలుపు ఇచ్చారు... క‌దిలిన త‌మ్ముళ్లెంద‌రు?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఘ‌ర్ వాప‌సీ పిలుపునిచ్చారు. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి ఖ‌మ్మం నియోజ‌క‌వర్గం లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పాత కాపులు తిరిగి వ‌చ్చేయాల‌ని ఆయ‌న సూచించారు. అయితే.. ఈ పిలుపు ఇచ్చి నాలుగు రోజులు గ‌డిచినా.. ఎవ‌రూ ముందుకురాలేదు. ముఖ్యంగా కీల‌క నేత‌లు గా భావిస్తున్న‌వారు కూడా ఎవ‌రూ స్పందించ‌లేదు. క‌నీసం ప‌న్నెత్తి ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు...ఖ‌మ్మంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావే కాదు.. చాలా మంది టీడీపీ నాయ‌కులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు సుప్త చేత‌నావ‌స్థ‌లో ఉన్నారు. కొంద‌రు బీఆర్ ఎస్ పార్టీలో అనుబంధ విభాగాల‌కు ఇంచార్జ్‌లుగా కూడా ఉన్నారు.

అయితే.. వీరికి కూడా ప్రాధాన్యం లేద‌నే టాక్ ఉంది. అస‌లు చంద్ర‌బాబు టార్గెట్ వీరే. పద‌వులు ఇచ్చినా ప్రాధాన్యం లేకుండా చేసిన వారు.. వెంట‌నే తిరిగి వ‌స్తే.. ప్రాధాన్యం ఇస్తాన‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

ఇక‌, ఆదిలాబాద్ జిల్లాలోనూ.. అనేక మంది నాయ‌కులు ఉన్నారు. మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్ లోనూ.. టీడీపీ నాయ‌కులు ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకునే.. చంద్ర‌బాబు ఇలా వ్యాఖ్యానించారు. కానీ, ఎవ‌రూ కూడా ముందుకు రాలేదు.

మ‌రోవైపు.. టీడీపీ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌.. బీఆర్ ఎస్ అలెర్ట్ అయింద‌ని టాక్‌. వెంట‌నే ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దింపి.. ఎవ‌రైనా టీడీపీలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అనే అంశంపై కూపీ లాగుతోంది.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎవ‌రూ కూడా టీడీపీవైపు క‌న్నెత్తి చూడ‌లేదు. మ‌రోవైపు టీడీపీ రాష్ట్ర ఇంచార్జ్‌.. అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ కూడా.. బాబు ప్ర‌క‌ట‌న‌ను పెద్ద‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దీనికి ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంతా కూడా క్రిస్మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల హ‌డావుడిలో ఉన్నార‌ని.. ఇది అయిపోతే.. క‌ద‌లిక ఉంటుందని తెలంగాణ టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి జ‌న‌వ‌రి త‌ర్వాత‌.. ఏమైనా మార్పు వ‌స్తుందేమో చూడాలి.