Begin typing your search above and press return to search.
ఈ ప్రశ్నకు టీడీపీ సమాధానం చెప్పటం లేదే ?
By: Tupaki Desk | 31 Aug 2021 11:30 AM GMTఒకే ఒక్క ప్రశ్న తెలుగుదేశం పార్టీని బాగా ఇరుకున పడేస్తోంది. వైజాగ్ పరిపాలనా రాజధానిగా టీడీపీ సానుకూలమా ? వ్యతిరేకమా ? అన్న ప్రశ్నకు చంద్రబాబునాయుడు ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఒకవైపు వైజాగ్ పరిపాలనా రాజధాని విషయంలో సూటిగా సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు చేసిన డిమాండ్ కు చంద్రబాబు అస్సలు స్పందించడం లేదు. చంద్రబాబే కాదు ఉత్తరాంధ్రలోని నేతలు కూడా ఎవరు నోరిప్పటంలేదు.
రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా ఉత్తరాంధ్ర వాసే అయినా సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నారు. రాజధాని ప్రశ్నను అచ్చెన్నాయుడును ఎప్పుడడిగినా ఏదో డొంకతిరుగుడుగా సమాధానం చెప్పటమే కానీ సూటిగా మాత్రం స్పందించ లేకపోతున్నారు. పరిపాలనా రాజధానిగా వైజాగ్ కు తరలిపోవడం ఈరోజు కాకపోయినా రేపైనా తప్పదని వైసీపీ నేతలు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
వైసీపీ నేతల కాన్ఫిడెంట్ కి కారణం ఏమిటంటే రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించేది కేవలం ప్రభుత్వమే కానీ కోర్టులు కావట. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే రాజధాని నిర్ణయం తమ పరిధిలోని అంశం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడో సీనులో నుండి తప్పుకున్నది. కర్నూలుకు హైకోర్టు తరలడం మాత్రమే పెండింగ్ లో ఉందని అధికార పార్టీ నేతలంటున్నారు. ఈ విషయంలో కనుక సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మిగిలినది లాంఛనమే అంటున్నారు.
అయితే రాజధాని తరలింపులో ఓ విషయంలో మాత్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందని రాయలసీమ ఉద్యమనేత పురుషోత్తమరెడ్డి అంటున్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పమని ప్రభుత్వాన్ని కోర్టు అడిగే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యకు ప్రభుత్వం గనుక పరిష్కారం చూపగలిగితే రాజధాని తరలింపు విషయంలో కోర్టు అడ్డుకునే అవకాశం లేదని రెడ్డి స్పష్టంగా చెప్పారు. మరి కోర్టు ఏమి చెబుతుందో చూడాల్సిందే.