Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు సింప‌తి.. ఆయ‌న‌కా.. పార్టీకా...?

By:  Tupaki Desk   |   18 Nov 2022 4:30 AM GMT
చంద్ర‌బాబు సింప‌తి.. ఆయ‌న‌కా.. పార్టీకా...?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. ఆయ‌న దాదాపు సింప‌తీ రాజ‌కీయాల‌నే న‌మ్ముకు ని ఎదిగార‌ని అనిపిస్తుంది. విజ‌న్ ఉన్నా.. అభివృద్ధి కాముకుడ‌నే పేరున్నా.. ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి మాత్రం చంద్ర‌బాబు సింప‌తీ పాలిటిక్స్‌కు తెర‌దీస్తున్నారు. 2014లో వ‌స్తున్నా మీకోసం.. యాత్ర ద్వారా ప్ర‌జ‌ల్లో సింప‌తీని తీసుకువ‌చ్చారు. గెలిచారు. 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి... ప‌సుపు-కుంకుమకు తెర‌దీశారు.

వాస్త‌వానికి ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు చెప్పుకొనేందుకు రాజ‌ధాని ఉంది.. కాపుల‌కు ఈ డ‌బ్ల్యూఎస్ కోటాలో ఇచ్చిన‌.. రిజ‌ర్వేష‌న్ ఉంది.. ఉద్యోగుల‌కు 43 శాతం ఇచ్చిన ఫిట్‌మెంట్, ఇత‌ర సౌక‌ర్యాలు ఉన్నాయి.

చంద్ర‌న్న కానుక‌లు ఉన్నాయి. తోఫాలు ఉన్నాయి. అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అయినా..ఇవేవీ ఆయ‌న ప‌ట్టించుకోకుండానే.. కేవ‌లం.. ప‌సుపు-కుంకమ‌ను ప‌ట్టుకుని ప్ర‌చారం చేశారు. అయితే.. అది బెడిసి కొట్టింది.

ఇక‌, ఇప్పుడు క‌ట్ చేస్తే.. ఏకంగా.. తీవ్ర‌మైన సెంటిమెంటు అస్త్రాన్ని ప్ర‌జ‌ల‌పై ప్ర‌యోగించారు. అదే.. 'లాస్ట్ ఛాన్స్‌'. ఇదే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని.. త‌న‌ను గెలిపించి.. అసెంబ్లీకి పంపించాల‌ని..ఆయ‌న ప్ర‌జ‌ల‌ను వేడుకున్నారు. వాస్త‌వానికి.. ఈ సెంటిమెంటును ఆయ‌న ఏడాదిన్న‌ర‌ముందే.. ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డం వ‌ల్ల‌.. ప్ర‌యోజ‌నం ఉంటుందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్పుడు జ‌రిగింది రేపు మ‌రిచిపోయే ప‌రిస్థితి ఉంది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేసిన ఈ సెంటిమెంటు డైలాగు ప్ర‌జ‌ల‌కు ఎంత‌మేర‌కు ఎన్నిక‌ల వ‌ర‌కు గుర్తుంటుంది? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు, అస‌లు.. ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా తెర‌మీదికి వ‌స్తోంది. చంద్ర‌బాబు.. గెలిపించ‌మ‌న్న‌ది.. త‌న‌నేనా.. లేక పార్టీనా? అనేది కూడా ప్ర‌శ్న‌గా మారింది.

ఎందుకంటే.. పార్టీని గెలిపించాల‌ని అంటే.. ఇది చివ‌రి ఎన్నిక కాదు.. పోనీ..త‌న‌ను గెలిపించాల‌నే అడిగారా? అనేది ప్ర‌శ్న‌. దీంతో సోషల్ మీడియాలో చంద్ర‌బాబు చేసిన‌ కామెంట్ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీసింది. చివ‌ర‌కు ప్ర‌జ‌లు ఏం తేలుస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.