Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారును ఆడేసుకున్న చంద్రబాబు..
By: Tupaki Desk | 7 Oct 2022 3:30 PM GMTఏపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇదీ నేడు మన రాష్ట్రం అంటూ పలు ఘటనలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. పలు అంశాలపై సీఎం జగన్ చేసిన ప్రకటనలు.. వాటికి సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను చంద్రబాబు ప్రస్తావించారు.
అదేసమయంలో బాధితుల ఆవేదనను కూడా.. ఆయన పంచుకున్నారు. ఏపీ సర్కారు చెబుతున్న దానికి..క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి సంబంధం లేదని.. చంద్రబాబుపదే పదే అంటున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలతో ఆయన విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా జె తిమ్మాపురంలో ఆసుపత్రికి వెళుతున్న పసిబిడ్డ.. గుంతల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావించారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ఎప్పటి నుంచో అన్ని పక్షాలుపోరాడుతున్నాయి. స్వయంగా..పొరుగు రాష్ట్రాల మంత్రుల కూడా.. తమ స్నేహితులు చెప్పారంటూ.. ఏపీ రహదారులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయినా.. రోడ్లు బాగుపడలేదు.
ఇక, ప్రభుత్వం కాంట్రాక్ట్ బిల్లులను మంజూరు చేయక పోవడంతో.. క్యాన్సర్ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక వేదన పడుతున్న లేపాక్షి మండలం వెంకటశివప్ప ఘటనను చంద్రబాబు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో పనిచేసినవారికి.. కక్షతోనే బిల్లులు నిలుపుదల చేశారంటూ. కొన్నాళ్లుగా టీడీపీ ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ప్రభుత్వం బేఖాతరు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి.
రాష్ట్ర ఆదాయం గాడిన పడింది అన్న సిఎం సమీక్ష వార్తను పేర్కొన్న చంద్రబాబు.. నెల మొదలై వారం రోజులు అయినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పడని అంశాన్ని ప్రస్తావించారు. ఇదేనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? అంటూ.. ఆయన నిలదీశారు.
రాష్ట్రంలో పాలనా దుస్థితికి ఈ ఘటనలే ఉదాహరణలని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో చెప్పడానికి ఇవి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలను బాదేసి మరీ వసూలు చేస్తున్న పన్నులు ఎటుపోతున్నాయని ప్రశ్నించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.