Begin typing your search above and press return to search.

ఏపిలో పర్యటనలు షిఫ్టు సిస్టమ్ లోనేనా ?

By:  Tupaki Desk   |   26 Nov 2020 5:00 PM GMT
ఏపిలో పర్యటనలు షిఫ్టు సిస్టమ్ లోనేనా ?
X
చంద్రబాబునాయుడు, నారా లోకేష్ వ్యవహారం మరీ విచిత్రంగా ఉంటోంది. రాష్ట్ర పర్యటనల్లో ఇద్దరు ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత మరొకరు వంతుల వారీగా వచ్చి పోతున్నారా ? వీళ్ళిద్దరి వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఓ వారం అమరావతికి చంద్రబాబు వస్తే మరో వారం లోకేష్ వస్తున్నారు. తాజాగా లోకేష్ రెండు రోజుల క్రితమే అమరావతికి చేరుకున్నారు. అంతకుముందు చంద్రబాబు ఒక్కరే అమరావతికి వచ్చారు. మరి ఇద్దరు ఒకేసారి అమరావతిలో నేతలకు అందుబాటులో ఎప్పుడుంటారు ?

మరి కొంతకాలం పాటు ఇది అనుమానమే. కరోనా వైరస్ కారణంగా చంద్రబాబు దాదాపు ఎనిమిది నెలలుగా అమరావతికి దూరంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. చంద్రబాబుతో పాటే లోకేష్ కూడా హైదరాబాద్ లో ఇంటికే పరిమితమైపోయారు. లోకేష్ ఎక్కుడున్నాడనేది ఇంపార్టెంట్ కాదు కానీ చంద్రబాబు విషయంలోనే నేతల్లో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. నెలల తరబడి తమ అధినేత నేతలకు, కార్యకర్తలకు ఏకంగా రాష్ట్రానికే దూరంగా ఉండటమే ఎవరికీ నచ్చలేదు.

ఇదే విషయాన్ని జూమ్ కాన్ఫరెన్సుల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ అధినేత అమరావతిలో నేతలకు అందుబాటులో లేకపోవటం వల్ల చాలామందిలో చులకనభావం ఏర్పడుతోందని చింతకాయల ఎంతచెప్పినా చంద్రబాబు వినటం లేదు. చంద్రబాబంటే వయస్సయిపోయిన నేత కాబట్టి కరోనా వైరస్ కారణంగా ఇంట్లో నుండి బయటకు రావటం లేదంటే ఏదోలే అనుకుంటారు. మరి లోకేష్ కు ఏమైంది ?

పైగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేయటానికి కూడా ఇద్దరిలో ఎవరు ఇష్టపడటం లేదు. ఒకవైపు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారంతో అన్నీ పార్టీలు హోరెత్తించేస్తుంటే టీడీపీ ప్రచారంలో మాత్రం హడావుడి ఎక్కడా కనిపించటం లేదు. తన అవసరం హైదరాబాద్ లో ఉన్నపుడు లోకేష్ ఏపిలో ఏమి చేస్తున్నాడనే చర్చ నేతల్లోనే పెరిగిపోతోంది. మరి నేతల ఆలోచనలకు ఏమైనా విలువిస్తారా ? లేకపోతే షిఫ్టుల వారీగా ఏపికి వచ్చి వెళుతుంటారా అన్నది చూడాల్సిందే.