Begin typing your search above and press return to search.
పక్క..పక్కనే నడిచిన బాబు..పవన్..అయినా మాటల్లేవ్!
By: Tupaki Desk | 22 Jun 2018 9:13 AM GMTఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకూ మిత్రులుగా వ్యవహరించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ఇద్దరు పక్కపక్కన నడిచే సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. రాజకీయంగా కత్తులు దూసుకునే నేతలు ఇద్దరు ఎదురు పడినప్పటికీ.. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి పలుకరించుకోవటం మామూలే. అందుకు భిన్నంగా.. బాబు.. పవన్ లు ఇద్దరు పక్కపక్కనే కాసేపు నడిచినా.. ఒకరి ముఖం మరొకరు చూసుకోవటానికి ఇష్టపడకపోవటం ఆసక్తికరంగా మారింది.
ఆ మధ్య వరకు బాబు అనుభవాన్ని అదే పనిగా వెనకేసుకొచ్చిన పవన్.. పార్టీ ఆవిర్భావ సభ నుంచి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించటం మొదలు పెట్టారు. నాలుగేళ్లుగా తనకు దన్నుగా నిలిచి.. హటాత్తుగా విమర్శలు చేస్తున్న పవన్ పైన బాబు సైతం మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇరువురి మధ్య స్నేహ బంధం ముగిసిన తర్వాత తొలిసారి ఇరువురు ఎదురెదురుపడ్డారు. అయినప్పటికీ వీరిద్దరు పలుకరించుకోవటం తర్వాత.. ముఖముఖాలు చూసుకోవటానికి సైతం ఇష్టపడకపోవటం విశేషం. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు పంచాయితీ పరిధిలోని లింగమనేని ఎస్టేట్స్ సమీపంలోని ఐదు ఎకరాల స్థలంలో దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు గుడి వద్దకు వచ్చే సమయానికి పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బాబు.. పవన్ ల చేత పూజలు చేయించారు గణపతి సచ్చిదానంద స్వామి. ఈ సమయంలో ఇరువురు పక్కపక్కనే ఉన్నారు. కాసేపు నడిచారు కూడా. అయినా వారిద్దరూ ఒకరినొకరు పలుకరించకపోవటమే కాదు. ముఖముఖాలు చూసుకునేందుకు సైతం ఇష్టపడకపోవటం గమనార్హం. ఆలయంలో కొందరు మహిళలు సీఎం బాబుతో మాట్లాడుతున్న వేళ.. పవన్ ఆయన పక్క నుంచే వెళ్లారు. ఆ సమయంలోనూ పలుకరించుకోలేదు. పవన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆలయానికి చేరుకోవటంతో సందడి నెలకొంది.మొదట్నించి వైరం ఉన్న నేతలు సైతం ఇంతలా ఉండరన్న మాట పలువురి నోట వినిపించింది. చూస్తుంటే. .రాజకీయ విభేదాలు వ్యక్తిగత స్థాయికి చేరుకున్న వైనం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.