Begin typing your search above and press return to search.
విపక్షాల మాటేంటి : ఏపీ ప్రజలు పిరికివారా...ఎందుకలా ?
By: Tupaki Desk | 23 July 2022 2:30 AM GMTఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియదు. చాలా చిత్రమైన తీరున రాజకీయ నాయకులు మాట్లాడుతూంటారు. ముఖ్యంగా తాము అధికారంలో ఉంటే అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ గా ఉండాలని కోరుకునే వారు ఖర్మం చెడి విపక్షంలోకి తాము వస్తే మాత్రం జనాలు తిరగబడాలని పిలుపు ఇస్తారు.
అసలు ప్రజాస్వామ్యంలో ఈ తిరుగుబాట్లు సాధ్యమేనా. అలాంటివి జరుగుతాయా. జనాలు తాముగా రోడ్ల మీదకు వస్తే అది అరాచకం అవుతుంది తప్ప డెమోక్రసీ అవుతుందా ఇవన్నీ ప్రశ్నలు. చర్చించాల్సిన విషయాలు. ఇదంతా ఎందుకు అంటే ఏపీలో విపక్షాలు ఇపుడు ప్రజల మీద కూడా విమర్శలు చేస్తున్నాయి. సీనియర్ మోస్ట్ నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి మరో మూడు సార్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అయితే ప్రజలను వట్టి పిరికివారుగా జమ కడుతున్నారు. మీకు ఓపిక చాలా ఎక్కువ అని కూడా వెటకారం ఆడుతున్నారు. ఎంతకాలం ఇలా ఓర్చుకుంటారని రెట్టిస్తున్నారు.
గోదావరి జిల్లాల టూర్ లో చంద్రబాబు చేస్తున్న కొన్ని కామెంట్స్ తమాషాగా ఉండడం విశేషం. మీరు ఇలాగే ఉంటే ఏపీ మరో శ్రీలంకగా మారుతుంది అని కూడా హెచ్చరిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం మీద ప్రజలు పోరాటం చేయలేదు అన్న అక్కసుతో బాబు అంటున్న మాటలుగా చూస్తున్నారు.
నిజానికి ప్రజలు ఎపుడూ పిరికివారు కాదు, వారికి తెలుసు, తామె అసలైన ప్రభువులమని, ఎవరికి ఎపుడు ఎలా కీలెరిగి వాత పెట్టాలో కూడా తెలుసు. లేకపోతే ఈ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా చెప్పుకున్న ఇందిరా గాంధీనే జనాలు ఓడించారు. అంతేనా దేవుడుగా ముద్ర పడిన ఎన్టీయార్ ని కూడా ఓడించినది ఇదే ప్రజానీకం.
ఇక తిరుగులేదు అనుకున్న ఎంతో మంది నాయకులను ఇంటికి పంపించిన చరిత్ర కూడా ప్రజలదే. కాస్తా లేట్ అయితే కావచ్చు కానీ చర్యలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. అంతదాకా ఎందుకు పాలన బాగాలేదు అనే కదా 2019లో టీడీపీని జనాలు ఘోరంగా ఓడించారు. ఇపుడు వైసీపీ పాలన బాగులేకపోతే 2024లో కచ్చితంగా ఓడించి ఇంటి దారి చూపిస్తారు.
దానికి సమయం ఉంది. అందుకే జనాలు సహనంతో ఉన్నారు. అన్నీ చూస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది మరో మాట. ఈ దేశంలో చదువులేని వారు అంటారు కానీ అతనే ప్రభుత్వాలను మారుస్తాడు. బలహీనుడు అంటారు అతనే ఈ దేశంలోని నాయకులను మాజీలను చేస్తాడు. అయితే ప్రజలను ప్రజాస్వామ్యంలో నడిపించాల్సింది నాయకులు.
వారు ఆ పని చేయడం మానేసి ప్రజలను తిరబడమని చెబితే అది ఈ రోజు బాగుంటుంది. రేపటి రోజున తామే అధికారంలోకి వస్తే అపుడు కూడా ఇలాగే జనాలు తిరగబడితే చూస్తూ ఊరుకోగలరా అన్నదే ప్రశ్న. ఈ మధ్య తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏపీ జనాల్లో చైతన్యం లేదని, వారు ప్రతీదానికీ నిమ్మకుండిపోతారని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. భయమెందుకు మెత్తగా ఎందుకు ఉంటారని పవన్ కూడా తాజాగా నిర్హహించిన మండపేట సభలో అన్నారు.
అయితే రాజకీయ నాయకులు తమ బాధ్యతలను మరచిపోయి జనాలను నిందించడం మానుకోవాలని కూడా సూచనలు వస్తున్నాయి. జనాలు ఎపుడూ ధైర్యవంతులు, తెలివైన వారు. ప్రజాస్వామ్యంలో వారే నిజమైన రాజులు కాబట్టి వారి శక్తిని శంకించడం మానేసి తామేమి చేయాలో విపక్షాలు ఒక అజెండా పెట్టుకుని పోరాటాల ద్వారా ముందుకు సాగితే మంచిదన్న సూచనలు వస్తున్నాయి.