Begin typing your search above and press return to search.
వైసీపీ దాడుల సంస్కృతి కుప్పానికి కూడా పాకింది
By: Tupaki Desk | 16 May 2022 11:30 AMతన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం దాడుల సంస్కృతిని తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కుప్పంలో ఓ హోటల్‌పై వైసీసీ కౌన్సిలర్లు చేసిన దాడిని చంద్రబాబు ఖండించారు.
కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసీపీ తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. భోజనం అయిపోయిందని చెప్పిన హోటల్ సిబ్బందిపై.. వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమన్నారు.
ఫర్నిచర్ ధ్వంసం చేసి మహిళల్ని బెదిరించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
"హోటల్ తగలబెడతాం, నిర్వాహకుల్ని చంపేస్తాం అంటూ బెదిరిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు" అని నిలదీశారు. కఠిన చర్యలతో క్రిమినల్ కార్యకలాపాలకు ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు.
''కుప్పంలో హోటల్ పై వైసిపి కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్ పై వైసిపి ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం''
''ఫర్నిచర్ ధ్వంసం చేసి,మహిళలను బెదిరించడం పై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి.హోటల్ నిర్వాహకులను చంపేస్తాం...హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది''. అని చంద్రబాబు వరుస ట్వీట్ చేశారు.