Begin typing your search above and press return to search.
ప్రజల్ని ఇంతగా కష్టపెట్టామా.. బాబు ఆవేదన!
By: Tupaki Desk | 25 May 2019 8:15 AM GMTఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు రోజులు గడుస్తున్నా.. ఏపీ టీడీపీ అధినేతతో సహా నేతలు.. కార్యకర్తలు.. అభిమానులు రిజల్ట్ షాక్ నుంచి బయటకు రావట్లేదు. ఓడిపోతే ఓడిపోవొచ్చు కానీ మరీ ఇంత దారుణంగానా? అన్నది వారి ఆవేదనగా మారింది. టీడీపీ నేతల మాటలు వింటే.. ఓడిపోయే పోయాం.. కానీ ఇంత దారుణంగా ఓడిపోకుండా ఉంటే బాగుండేది.. ముఖం చూపించుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
టీడీపీ నేతలు పరిస్థితి ఇలా ఉంటే.. వారిని బుజ్జగించాల్సిన అధినేత చంద్రబాబు పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. ఫలితాల్ని చూసి ఆయన భిన్నుడయ్యారంటున్నారు. ఎక్కడ తప్పు చేశాం? ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టామా? జగన్ మీద ప్రజల్లో ఇంత అభిమానం ఉందా? అంటూ ప్రశ్నలు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. దారుణ ఫలితాల నేపథ్యంలో కొందరు నేతలతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఓటమిపై విశ్లేషణ చేసినట్లుగా తెలుస్తోంది. బాబు మాటల్ని చూస్తే.. ఎన్నికల ఫలితాల షాక్ నుంచి ఆయన కోలుకోలేదని.. ఆ మాటకు వస్తే ఇప్పట్లో ఆయన కోలుకోవటం కష్టమనే వాదన వినిపిస్తోంది. బాబు మాటలు విన్న టీడీపీ నేతలు సైతం ఆవేదన చెందుతున్నారు. బాబులో ఇంతటి నిరాశ.. నైరాశ్యం.. ఆవేదన గతంలో ఎప్పుడూ కనిపించలేదంటున్నారు.
మేజిక్ ఫిగర్ కు కాస్త అటు ఇటుగా ఫలితాలు వస్తాయని అనుకున్నాం కానీ మరీ ఇంత దారుణంగా ఫలితాలు రావటం ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.స్థానికంగా ఉన్న సమస్యలు..కింది స్థాయి నేతల తీరు మీద వచ్చిన ఆరోపణలు దెబ్బ తీశాయని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న టీడీపీ నేతల్ని బాబు వారించారని అంటున్నారు. ప్రజల్ని ఇంతలా కష్టపెట్టామా? జగన్ ను ప్రజలు అంతలా ఎలా నమ్మారు? ఎక్కడ ఫెయిల్ అయ్యాం? అంటూ ఆయన ప్రశ్నలు వేస్తున్నారంటున్నారు.
ఐదేళ్లు మీరు కష్టపడ్డారు.. ప్రజలకు మీరు చేసిన పనులు తెలుసంటూ కొందరి మాటలతో బాబు విభేదించినట్లుగా తెలిసింది. ఈ ఫలితాలు మామూలు కావని.. వీటిని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందంటుననారు. ప్రజలకు అన్ని తెలుసని.. అన్నీ బేరీజు వేసుకున్నాకే తీర్పు ఇస్తారన్నారు. పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేయటం వల్ల వ్యతిరేక ఓటు చీలుతుందని అనుకున్నాం కానీ.. తమకే నష్టమయ్యేలా ఉంటుందని ఊహించలేదన్న వాదన టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. పవన్ టీడీపీ మద్దతుదారుడంటూ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కు వెళ్లకుండా జగన్ కు వెళ్లిందన్నారు. క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలు.. ఆర్థికంగా ఎదురైన ఇబ్బందులు. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారిన వైనం కూడా ప్రభావాన్ని చూపించి ఉంటాయన్నారు. ఈసారి అభ్యర్థులకు నిధులు అందలేదని.. పోల్ మేనేజ్ మెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ కంటే వెనుకబడి ఉన్నామని కొందరు నేతలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఎన్ని అనుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది.? చేతులు మొత్తం కాలిపోయిన తర్వాత.. ఎంత ఆయింట్మెంట్ రాసినా నొప్పి.. గాయం తగ్గటానికి కాంత టైం తప్పదు. అది ఐదేళ్లా.. పదేళ్లా? అన్నదే ప్రశ్న.