Begin typing your search above and press return to search.
చంద్రబాబు పుట్టిన రోజు సందేశం.. ఇదే!
By: Tupaki Desk | 20 April 2022 9:35 AM GMTతెలుగు జాతికి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భం గా చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం టీడీపీ ఎప్పుడూ పాటుపడుతుందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తనను ఆశీర్వదిస్తున్నారని.. తన జన్మదినం సందర్భంగా వేడుకలు చేసుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారని చెప్పారు. వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి అంచనాలకు తగ్గట్లు పని చేస్తూ టీడీపీని ముందుండి నడిపిస్తానని చంద్రబాబు వివరించారు. మరోవైపు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఆ పార్టీ నేతలు, శ్రేణులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు నివాసంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ నేతలు దేవినేని ఉమా, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమ, టీడీ జనార్దన్‌లు విషెస్ చెప్పారు.
తిరుమల అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర మీడియా సమన్వయకర్త శ్రీధర్ వర్మ 720 కొబ్బరికాయలు కొట్టి, 720గ్రాముల కర్పూరం వెలిగించారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత పార్టీ కార్యకర్తలు 1,116 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమా ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించా రు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుజాతికి పూర్వవైభవం తేవాలని కార్యకర్తలకు సూచించారు.
పరిపాలనా దక్షతతో ప్రపంచ దేశాల కళ్లు తెలుగువారి వైపు మళ్లించారని కొనియాడారు. విజయవాడలోని పటమట స్కూల్ పిల్లలతో కలిసి దేవినేని చందు 72కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన 250మంది పిల్లలకు పుస్తకాలతో పాటు స్టేషనరీ పంపిణీ చేశారు. గుంటూరులో నక్కా ఆనంద్‌బాబు, నసీర్ అహ్మద్‌లు కేక్ కట్ చేశారు.