Begin typing your search above and press return to search.
బాబు గారి....ఎన్నికల పాదాభివందనాలు
By: Tupaki Desk | 30 Jan 2019 5:30 AM GMTనారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాజకీయ దురంధరుడిగా పేరొందిన నాయకుడు. ఎంతటి వారినైనా చూపుడు వేలు చూపిస్తూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడే నేత. అయితే ఇదంతా గతం అంటున్నారు ఆయన సన్నిహితులు. అంతే కాదు... గడచిన రెండు నెలలుగా నారా చంద్రబాబు నాయుడ్ని గమనించిన వారు కూడా ఆయనలో ఓ మార్పు వచ్చిందంటున్నారు.
ఇంతకీ ఆ మార్పు ఏమిటనుకుంటున్నారా. సౌమ్యం. పెదవిపై చిరునవ్వు ఎలా ఉంటుందో తెలియని చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ సమావేశాల్లో నాయకులతో మాట్లాడుతూ నవ్వుతున్నారు. అంతే కాదు.... జోకులు కూడా వేస్తున్నారట. ఈమధ్య చంద్రబాబు నాయుడి ధోరణిలో చాలా మార్పు వచ్చిందంటున్నారు. ఇంత వరకూ ఎంత పెద్ద వారైనా రెండు చేతులతో దండ పెడుతూ ముభావంగా ఉండడమే చంద్రబాబు నాయుడి నైజం. ఈ మధ్య ఆ ధోరణికి ఆయన సెలవు ఇచ్చారంటున్నారు. తన కంటే వయసులో పెద్ద వారు ఎదురు పడితే గతంలోలా కాకుండా ఏకంగా కాళ్లకు దండాలు పెట్టేస్తున్నార చంద్రబాబు నాయుడు. బహిరంగసభల్లో అయితే ఇదీ మరీ ఎక్కువగా ఉందంటున్నారు.
ఈమధ్య తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో రాజధానికి విరాళం ఇచ్చిన అప్రవున్నీసాబేగం కాళ్లకు దండం పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పదవీవిరమణ చేసిన అప్రవున్నీసా బేగం తన పించన్ లోంచి దాచుకున్న 50 వేల రూపాయలు జన్మభూమికి విరాళంగా ఇచ్చారు. తాజాగా అనంతపురం జిల్లా కుంటిమద్ది గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే వ్రద్ధురాలు కూడా రాజధాని కోసం 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆమెకు కూడా బహిరంగ సభలో పాదాభివందనం చేశారు. ఈ రెండు సంఘటనలను చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికే మీడియాగా చెప్పుకుంటున్న పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
ఇంతకు ముందు కూడా అమరావతి నిర్మాణానికి లక్షలు, కోట్లు ఇచ్చిన దాతలు ఉన్నారు. అయితే వారందరి పట్లా చూపించని అతి మర్యాద ఈ ఇద్దరు మహిళల పట్ల చూపించడానికి కారణం రానున్న ఎన్నికలే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడి నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎవరికీ... ఎంత పెద్ద వారికీ కూడా పాదాభివందనాలు చేసిన దాఖలాలు లేవంటున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా పాదాభివందనాలతో ప్రజలను ఆకట్టుకోవాలన్నది చంద్రబాబు నాయుడి కొత్త ఎత్తుగడగా చెబుతున్నారు.