Begin typing your search above and press return to search.
మళ్లీ చంద్రబాబు చిత్తూరు టూర్.. ఈ సారి టెన్షన్ లేదు తమ్ముడూ!!
By: Tupaki Desk | 9 Jan 2023 1:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇటీవల పర్యటిం చేందుకు వెళ్లిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకున్న రగడ కూడా అందరికీ తెలి సిందే. మూడు రోజుల పాటు చంద్రబాబు అక్కడ పర్యటించే ప్రయత్నం.. చేయడం.. దీనికి పోలీసులు.. జీవో 1 చూపించి నిబం ధనలు గుర్తు చేయడం.. ఫలితంగా చోటు చేసుకున్న పొలిటికల్ వివాదం అందరికీ తెలిసిందే.
అయితే.. తాజాగా మరోసారి చంద్రబాబు చిత్తూరులో పర్యటించేందుకు రెడీ అయ్యారు. అయితే.. ఈ సారి ఆయన కుటుంబంతో సహా.. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు చిత్తూరుకు వెళ్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబాలు సంబరాలు చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఈ రెండు కుటుంబాలు కూడా ఏటా సంక్రాంతికి నారావారి పల్లెకు వస్తుంటాయి.
అయితే అమరావతి రాజదాని రగడతో ఒకసారి, కరోనా కారణంగా రెండేళ్లు వెరసి మూడేళ్ల పాటు సంక్రాం తి సంబరాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగ ఇక్కడ నిర్వహించుకునేం దుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో నారా వారి పల్లెలోని చంద్రబాబు ఇంటికి పెయింటింగ్ వేసి, ఆవరణలో రంగులతో తీర్చిదిద్దారు.
ఇదీ షెడ్యూల్
+ ఈనెల 12వ తేదీన నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా దేవాన్ష్ రానున్నారు.
+ 13న చంద్రబాబునాయుడు, లోకేశ్ రానున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా వస్తారు.
+ 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు వీడ్కోలు తీసుకుంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.