Begin typing your search above and press return to search.
చిన్నబాబును జీరో చేస్తున్న పెద్దబాబు..!
By: Tupaki Desk | 18 Nov 2022 8:30 AM GMTటీడీపీ యువ నాయకులు, భావి ముఖ్యమంత్రిగా టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్న నేత.. నారా లోకేష్. ఆదిలో ఏమోకానీ.. ఇటీవల కాలంలో ఆయన పదునైన మాటలతో.. వైసీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకా దు.. తన టార్గెట్ అంతా కూడా.. ముఖ్యమంత్రి జగన్‌పైనే పెట్టారు. ఎక్కడ పెదవి విప్పినా.. వెంటనే జగన్‌పైనే విరుచుకుపడుతున్నారు. మరి అలాంటి నాయకుడు ఎదగాలంటే.. చంద్రబాబు అంతో ఇంతో దన్ను ఇవ్వాలికదా!
ఇస్తున్నారు. లోకేష్ ఎదిగేందుకు, రాజకీయంగా పదును తేలేందుకుచంద్రబాబు తనదైన శైలిలో ఆయన కు సహకరిస్తున్నారు. అయితే.. అప్పుడప్పుడు మాత్రం చంద్రబాబుచేస్తున్న కామెంట్లు పరిశీలిస్తే.. అవి నారా లోకేష్‌కు మైనస్‌గా మారుతున్నాయి.
తాజాగా కర్నూలులో పర్యటించిన చంద్రబాబు.. ఆసక్తిక విషయాలు చెప్పారు. ఇదే చివరి ఎన్నికని.. తనను సీఎంను చేయాలని అన్నారు. పైకి ఇవి బాగానే ఉన్నా.. అంతర్గతంగా వైసీపీ నాయకులు మాత్రం యాంటి ప్రచారం చేస్తున్నారు.
ఇవే చివరి ఎన్నికలు అంటే.. ఇక, టీడీపీ తర్వాత.. ఉండదనే అర్ధం వచ్చేలా వైసీపీ నాయకులు అప్పుడే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు తర్వాత.. ఆ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నారా లోకేష్ రెడీగానే ఉన్నారు.
మరి అలాంటప్పుడు.. టీడీపీకి ఇవి చివరి ఎన్నికలు కావు. ఈ విషయాన్ని క్లరిటీగా చెప్పడంలో చంద్రబాబు ఎక్కడో విఫలమయ్యారు. ఇదే విషయాన్ని అనువుగాతీసుకున్న వైసీపీ నాయకులు మాత్రం.. ఎదురు దాడి ప్రారంభించారు.
ఇక, టీడీపీపని అయిపోయిందని,వచ్చే ఎన్నికల తర్వాత.. ఆ పార్టీ ఉండదని ప్రచారం చేస్తున్నారు. ఇది.. నారా లోకేష్ నాయకత్వానికి మచ్చగా మారింది. చంద్రబాబు లేకపోతే.. టీడీపీ లేదు.. అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తే.. అది నాయకుడిగా లోకేష్‌పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. అందుకే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసేప్పుడు చంద్రబాబు కొంచెం.. సంయమనం పాటించాలని కూడా సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.