Begin typing your search above and press return to search.
జగన్ సింహం కాదు.. పిల్లి.. చంద్రబాబు కామెంట్స్
By: Tupaki Desk | 9 May 2022 10:30 AM GMTఏపీలో సీఎం జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. 2024లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్‌కు అర్థమైందన్న చంద్రబాబు.. 'జగన్ సింహం కాదు పిల్లి`` అన్నారు. ఆ భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలన్న ఆయన.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడా నికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు చంద్రబాబు సూచించారు.
భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అని నినాదాలు చేశారు. కానీ.. జై జగన్ అన్నట్లు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. అదేవిధంగా.. నా వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారు. 2024లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్‌కు అర్థమైంది.
రాష్ట్ర ప్రజల్లో జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు అసమర్థ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి ఉన్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అయ్యిందన్న విషయం తన టూర్లకు వచ్చిన స్పందన ద్వారా స్పష్టం అయ్యిందని చెప్పారు.
2024లో టీడీపీకి అధికారం అనేది చారిత్రిక అవసరం అని ప్రజలే భావిస్తున్నారని అన్నారు. 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్ కు పూర్తిగా అర్థం అయ్యిందని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, జగన్ పోకడలను చూస్తే 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు అవనున్నాయని అన్నారు. జగన్ తాను పులి అని చెప్పుకుంటారని...కానీ జగన్ పిల్లి అంటూ చంద్రబాబు అన్నారు.
పిల్లి కాబట్టే భయంతో జగన్ అందరి కాళ్లూ పట్టుకుంటారని వ్యాఖ్యానించారు. వైసీపీ తన బలహీనతలను అధిగమించడానకి డైవర్షన్ పాలిటిక్స్ ను ఎప్పుడూ అమలు చేస్తుందని చంద్రబాబు అన్నారు. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అన్న స్లోగన్స్ ను జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన విధానాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలి అన్న తన వ్యాఖ్యలను.. పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని చంద్రబాబు అన్నారు.
వైసీపీ మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ ను తన విధానంగా పెట్టుకుందని.... తన పర్యటనలకు అనూహ్య స్పందన రావడంతో వైసీపీ డైవర్షన్ డ్రామా మొదలు పెట్టిందని అన్నారు. ముఖ్యనేతలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్టీ మండల, డివిజన్ స్థాయి అధ్యక్షులతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం ద్వారా మాట్లాడారు. టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదుపై సమీక్షించారు.