Begin typing your search above and press return to search.
బాబు ప్రకటనః కేసీఆర్ వస్తే.. హ్యాపీయే
By: Tupaki Desk | 21 Dec 2018 3:04 PM GMTఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని, త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పై ఏపీ ముఖ్యమంత్రి- తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిలో నిర్వహించిన సమన్వయ కమిటీలో పాల్గొన్న ఆయన... కేసీఆర్ నాకు రిటన్ గిఫ్ట్ ఇస్తానని అన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే సంతోషమే అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఏపీ కి వచ్చి గందరగోళం చేయాలని చూస్తున్నారని.. ఆయన వస్తే మనకే మంచిది అన్నట్లు నర్మగర్భంగా సీనియర్ నేతల ఎదుట తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల్లో అయోమయం సృష్టించాలనే కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ కాదని.. ఎలా తిప్పికొట్టాలో మనకు తెలుసు అంటూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు బాబు. కేసీఆర్ వస్తే భయమా ఏంటీ.. రమ్మనండి చూద్దాం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి - మార్చి నెలలోనే ఎన్నికలు రావొచ్చని.. ఇప్పటి నుంచే నేతలు, కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం కావాలని చంద్రబాబు నేతలను కోరారు. ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నం కావాలని, కార్యకర్తలను సమాయాత్తం చేయాలంటూ సూచనలు, సలహాలు ఇచ్చారు బాబు. అందరూ అలర్ట్ గా ఉండాలని.. ఎవరు ఎక్కడ పొరపాటు చేసిన పార్టీ మొత్తానికి నష్టం వస్తుందని హెచ్చరించారు. నేతలు - కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని హితబోధ చేశారు బాబు. ఇక నుంచి ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలోనే ఉండి పనులు చక్కబెట్టుకోవాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు.
దేశ రాజకీయాల్లో చాలా మార్పులు జరగబోతున్నాయని చంద్రబాబు జోస్యం చెప్పారు. అన్నింటికీ సిద్ధపడి ఉండాలని తెలిపారు. రాష్ట్రానికి ఏమీ చేయకుండా మోడీ 6వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొన్నారు. అందరు కలిసి ఆడుతున్న డ్రామాలు ప్రజాక్షేత్రంలో ఎండకట్టాలని చంద్రబాబు నేతల కు పిలుపునిచ్చారు. ఈవీఎంలతో కుమ్మక్కు అయితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించారు. దీని పై అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వివి ప్యాట్ లలో గుర్తు సరిగ్గా పడటం లేదు అని వెల్లడించారు. ఈవీఎంల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజల్లో ఆ మిషన్స్ పై నమ్మకం పోయిందన్నారు. బ్యాలెట్ ఓటింగ్ బెస్ట్ అంటూ తన అభిప్రాయాన్ని సీనియర్ నేతల ఎదుట వ్యక్తం చేశారు. పోల్ అయిన ఓట్ల కంటే కౌంటింగ్ లో ఓట్లు ఎక్కువ వస్తున్న విషయాలను వివరిస్తూ.. ఈవీఎంల పై అనుమానాలు వ్యక్తం చేశారు.