Begin typing your search above and press return to search.

బొత్స గెలుపును డిసైడ్ చేసిన బాబు?

By:  Tupaki Desk   |   24 July 2022 12:30 AM GMT
బొత్స గెలుపును డిసైడ్ చేసిన బాబు?
X
రాజ‌కీయాల్లో ఎన్ని స్టెప్పులైనా వేయొచ్చు. కానీ.. వాటిలో ఏ ఒక్క‌ రాంగ్ స్టెప్ప‌యినా.. పార్టీకి.. నేత‌ల‌కు కూ డా క‌ష్ట‌మే. ఇప్పుడు ఇదే మాట‌.. విజ‌య‌న‌గ‌రంలో జోరుగా వినిపిస్తోంది. ఈ ప‌రిస్థితి టీడీపీలోనే కావడం.. మ‌రింత చిత్రం. ఇక్కడి జిల్లా ప‌గ్గాల‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు.. కిమిడి నాగార్జున‌కు అందించారు. ఇటీవ‌ల ఇక్క‌డ ప‌ర్య‌టించిన చంద్ర బాబు.. నాగార్జున‌ను హైలెట్ చేశారు.

ఆయ‌న‌కే పగ్గాలు అప్ప‌గించారు. అంతేకాదు.. చీపురప‌ల్లి టికెట్ కూడా ఆయ‌న‌కే ఇస్తున్న‌ట్టు క‌న్ఫ‌ర్మ్ చేసిన ట్టు స‌మాచారం. క‌ట్ చేస్తే.. వాస్త‌వానికి ఇప్ప‌టికే కిమిడి పై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఆయ‌న ఎవ‌రితోనూ క‌లిసి ప‌నిచేయ‌ర‌ని.. త‌ల్లి మంత్రిగా ఉన్న ప్పుడు దూకుడుగా ఉన్నార‌ని.. బెదిరింపు రాజ‌కీయాలు చేశార‌ని.. టీడీపీలోనే విమ‌ర్శ‌లు వున్నాయి. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో చీపురుప‌ల్లి టికెట్ ఇచ్చినా.. బ‌ల‌మైన నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ పై ఆయ‌న ఓడిపోయారు.

ఇక‌, ఇప్పుడు కూడా కిమిడికే టికెట్ ఇవ్వ‌డం.. ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని కోల్పోవ‌డం.. మ‌రేమీ ఉండ‌ద‌ని.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌యాన్ని చంద్ర‌బాబుముందుగానే ఖ‌రారు చేసిన‌ట్టు అవుతుంద‌ని టీడీపీలోనే చ‌ర్చ సాగుతోంది. యువ‌నాయ‌కుడే అయినా.. వ్యూహాలు తెలియ‌ని నాయ‌కుడుగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వున్నాయి. సొంత పార్టీలోనే ఆయ‌న‌ను ఎవ‌రూ లెక్క‌చేయ‌డం.. లేదు. పైగా.. ఆయ‌న కూడా ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు.

ఇక‌, సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల‌పై కూడా.. కిమిడికి ఎక్క‌డా ప‌ట్టులేదు. ఇలాంటి నాయ‌కుడికి.. ఇప్పుడు మ‌ళ్లీ ఇదే టికెట్ ఇవ్వ‌డం.. విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ బాధ్య‌త‌లు అప్ప‌గిం చ‌డం.. వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంట‌నేది.. నాయ‌కుల ప్ర‌శ్న‌.

అంతేకాదు.. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసేది లేద‌ని.. కూడా అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో జోరుగా వినిపిస్తోంది. ఇక‌, చంద్ర‌బాబుకూడా.. నాగార్జున వైఖ‌రిని మార్చుకోవాల‌ని సూచించ‌కుండా.. నాయ‌కులే ఆయ‌న‌తో స‌ర్దుకు పోవాల‌నే విధంగా దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చంద్ర‌బాబు నిర్ణ‌యం.. వైసీపీకి బొత్స‌కు భారీ మేలు చేయ‌డం త‌థ్య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.