Begin typing your search above and press return to search.

చంద్రబాబు దీక్ష.. సమస్య తీరిపోయాకా!

By:  Tupaki Desk   |   10 Nov 2019 7:26 AM GMT
చంద్రబాబు దీక్ష.. సమస్య తీరిపోయాకా!
X
ఏపీలో రాజకీయ పార్టీలు ఇసుక రాజకీయంపై చాలా ఆశలే పెట్టుకున్నాయి. ఇసుక సమస్య అనేది కొత్తది కాదు, అరుదైనదీ కాదు. ప్రతియేటా వర్షాలు బాగా కురిస్తే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. భవన నిర్మాణాలకు మహానగరాలకు పల్లెల నుంచి వలసలు వెళ్లే వాళ్లు కూడా వర్షా కాలాల్లో సోంతూళ్లను చేరుతూ ఉండటాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇది కొత్త కాదు. భవన నిర్మాణాలకు వలసలు వెళ్లే ప్రాంతాలకు వెళ్లి చూస్తే వర్షాకాలంలో వారంతా సొంతూళ్లకు రావడాన్ని గమనించవచ్చు కూడా!

ఇక ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకాలు పొర్లాయి. దీంతో ఇసుకపై పెద్ద రాజకీయాన్ని ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. దాన్నొక పెద్ద దుమారంగా మార్చాలని చూశాయి.అయితే సమస్య గురించి పార్టీలకు అవగాహన లేకపోయినా ప్రజలకు అవగాహన ఉంది. దీంతో ప్రతిపక్షాల ఆటలు అనుకున్నట్టుగా సాగలేదు.

అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై చాలా రాజకీయమే చేయాలని చూస్తూ ఉన్నారు. ఆయన ఒక రోజు నిరాహార దీక్షకు దిగబోతూ ఉన్నారు. ఈ వారంలోనే చంద్రబాబు నాయుడు దీక్ష జరగబోతూ ఉంది.

ఇంతలో వస్తున్న అప్ డేట్ ఏమిటంటే.. ఇప్పటికే వాగులు కొంత వరకూ ఖాళీ అయ్యాయి. వారం నుంచి పెద్దగా వర్షాలు లేవు. దీంతో ఇసుక లభ్యత పెరిగింది. ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టన్నుల ఇసుక వెలికితీత జరుగుతోందని ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు దీక్షకు ఇంకా సమయం ఉండనే ఉంది. ఆలోపు వర్షాలు మరింతగా తెరిపినిస్తే ఇసుక ఫుల్ గా అందుబాటులోకి వచ్చేసినట్టే.దీంతో ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతారు కార్మికులంతా.

చంద్రబాబు నాయుడు మాత్రం పచ్చచొక్కాలను కూర్చోబెట్టుకుని తన దీక్షను చేయాల్సి రావొచ్చు అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.