Begin typing your search above and press return to search.
బాబు ఇసుక దీక్ష తుస్ మనటం ఖాయమట
By: Tupaki Desk | 13 Nov 2019 6:20 AM GMTఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి సరిగ్గా నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ కాలంలో చోటు చేసుకున్న భారీ వర్షాల కారణం గా నదుల్లో వరద పోటు తీవ్రం గా ఉండటం తో ఇసుక ను తవ్వి తీసే అవకాశం లేని పరిస్థితి. దీంతో.. కొంత ఇబ్బంది పరిస్థితి చోటు చేసుకున్నప్పటికీ.. దాన్నో రాజకీయ అంశం గా మార్చిన ప్రధాన ప్రతి పక్షం చలి కాచుకునే పనిలో పడింది.
ఇసుక లభ్యత విషయం లో ప్రభుత్వం తప్పు ఏమీ లేకున్నా.. ఇసుక కొరత అంశాన్ని పట్టు కొని నానా హంగామా చేసింది.నదుల్లో వరద తీవ్రత తగ్గితే కానీ ఇసుక లభ్యత ఉండదన్న వాస్తవం బాబు లాంటి వారికి తెలిసినా.. తెలీనట్లు గా.. ప్రభుత్వ వైఫల్యం తోనే ఇసుక కొరత చోటు చేసుకుందన్న భారీ ప్రచారమే కాదు.. తాజాగా దీక్ష కు సైతం డేట్ ఫిక్స్ చేసు కోవటం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం గురువారం (నవంబరు 14న) ఇసుక కొరతపై దీక్ష నిర్వహించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇందుకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటున్న వేళ.. బాబు గాలి పోయేలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశం ఒకటి జరిగింది. ఇసుక కొరత తీరేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్న విషయాన్ని ఏపీ ముఖ్య మంత్రి వెల్లడించారు. వరద తీవ్రత తగ్గు ముఖం పట్టటం కారణం గా ఇసుక లభ్యత పెరిగిందని.. ఇప్పుడున్న కొరతను మరో పది రోజుల్లో తగ్గు ముఖం పట్టటమే కాదు.. అవసరానికి మించిన ఇసుక లభ్యత రానుందన్న గుడ్ న్యూస్ చెప్పేశారు.
ఈ నెల 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాల్ని నిర్వహించటమే కాదు.. ఇసుక ధర డిసైడ్ చేసి.. దానికి మించి ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్లు జైలు శిక్ష విధిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. గతంలో సగటున 80వేల టన్నుల ఇసుక డిమాండ్ ఉండేదని.. వరదల కారణంగా ఇసుక రీచ్ లు మునిగిపోవటంతో ఈ డిమాండ్ ను తీర్చలేని పరిస్థితి ఉందన్న జగన్.. గత వారం లో మార్పు వచ్చిందన్నారు.
ప్రస్తుతం 1.20లక్షల టన్నుల ఇసుక అందుబాటు లోకి వచ్చిందని.. రీచ్ లు సైతం అరవై నుంచి తొంభై కి పెరిగాయన్న విషయాన్ని వెల్లడించారు. రానున్న కొద్ది రోజుల్లోనే ఇసుక నిల్వల్ని రెండు లక్షల టన్నుల కు తీసుకురానున్నట్లు చెప్పారు. దీంతో.. నిన్నటి వరకూ ఇసుక కొరత మీద బాబు చేసిన హడావుడికి పుల్ స్టాప్ పడనుందని చెప్పాలి. ఎన్నో ఆశల తో నిర్వహించాలనుకున్న దీక్ష తాజా పరిణామాల తో తుస్ మనటం ఖాయమంటున్నారు.