Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి పాలన : చంద్రబాబు డిమాండ్
By: Tupaki Desk | 19 Oct 2021 3:38 PM GMTప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్ధితి దిగజారిపోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి+పోలీసులు కుమ్మకై స్టేట్ టెర్రరిజాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఖండించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదన్నారు.
గతంలో ఏ పార్టీ కార్యాలయంపైన ఏ ప్రభుత్వంలో కూడా దాడులు జరగలేదని గుర్తించారు. డీజీపీ ఆఫీసుకు వంద గజాల దూరంలోనే ఉన్న తమ పార్టీ కార్యాలయంపైన దాడి జరగటం చాలా అన్యాయమన్నారు. తమ పార్టీ ఆఫీసులపై జరుగుతున్న దాడులను మాట్లాడేందుకు ఫోన్ చేస్తే డీజీపీ అటెండ్ కాలేదన్నారు. చివరకు గవర్నర్ కు ఫిర్యాదు చేయాల్సొచ్చిందన్నారు.
తమ పార్టీ కార్యాలయాలపైన జరిగిన దాడులు జగన్, డీజీపీలకు తెలిసే జరిగిందన్నారు. రాష్ట్రం డ్రగ్ మాఫియాగా మారిపోయిందన్నారు. గంజాయి రాష్ట్రంలో విపరీతంగా పండిస్తున్నట్లు చెప్పారు. గంజాయి వల్ల యువత, జాతి నిర్వీర్యం అయిపోతోందన్నారు. ఏపిలో గంజాయిని పండిస్తు దేశంలోని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు చంద్రబాబు మండిపోయారు. రాష్ట్రంలోకి హెరాయిన్ దిగుమతి చేసుకుంటున్నట్లు ఆరోపించారు.
ప్రభుత్వ, పోలీసుల వైఖరికి నిరసనగా బుధవారం రాష్ట్రబంద్ కు పిలుపిచ్చినట్లు చెప్పారు. తమ పార్టీ నేతలను చంపేస్తారా ? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయటమంటే ప్రజాస్వామ్యంపై దాడులు చేయటమే అన్నారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగటమంటే యావత్ 5 కోట్లమంది జనాలకు సంబంధించిన అంశంగా జనాలందరు చూడాలన్నారు. తమ నేతలపైనే దాడులు జరుగుతుంటే మామూలు జనాల మాటేమిటన్నారు.