Begin typing your search above and press return to search.

ఏంది ‘బాబు’ సీబీఐ వద్దు అన్నావ్..మళ్లీ కావాలంటావ్.. కరోనా కన్ఫ్యూజన్లో ఉన్నావా?

By:  Tupaki Desk   |   19 Aug 2020 1:30 PM GMT
ఏంది ‘బాబు’ సీబీఐ వద్దు అన్నావ్..మళ్లీ కావాలంటావ్.. కరోనా కన్ఫ్యూజన్లో ఉన్నావా?
X
40 ఇయర్స్ పాలిటిక్స్ అనుభవం గల పెద్ద మనిషి.. అవసరార్థం రాజకీయాలు మార్చడంలో చంద్రబాబును మించిన నేత మరొకరు లేరంటారు. చంద్రబాబు మాటలు కూడా కోటలు దాటుతాయి.. రాజ్యాంగాన్ని తిప్పి తిప్పి చదివినా అంటాడు. 2014-19 మధ్య సీబీఐ వద్దు అన్నాడు.. ఇప్పుడు అదే సీబీఐ కావాలంటాడు.. మోడీ పోవాలి.. మన్మోహన్ రావాలి అంటావ్.. మళ్లీ ఇప్పుడు మోడీకే జై అంటావ్.. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు ఇప్పటికీ కర్ర విరగకుండా పామును చంపే రాజకీయాన్ని చేస్తుంటాడని పొలిటికల్ సర్కిల్స్ లో ఆడిపోసుకుంటారు.

నిజానికి చంద్రబాబో.. లేక మరో నేత కోరగానే కేంద్రంలోని ప్రధానులు సీబీఐకి కేసులు అప్పగించరు.. దానికో ప్రొసీజర్ ఉంటుంది. ఏదైనా తీవ్రమైన నేరాల్లో ఎవరైనా కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే విచారణ సరిగా జరగడం లేదని భావిస్తే.. అప్పుడు కోర్టులు నమ్మి సీబీఐ విచారణకు ఆదేశాలు ఇస్తాయి. ఆ ఆదేశానుసారం కేంద్రంలోని ప్రభుత్వం సీబీఐ విచారణ జరుపుతుంది.

కానీ ప్రస్తుతం చంద్రబాబు మోడీకి లెటర్ రాసి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ చంద్రబాబు లెటర్ రాస్తే ప్రధాని మోడీ సీబీఐ విచారణ జరిపించేస్తారని ఆశపడుతున్నాడు. కానీ సీబీఐ విచారణ ఊరికే చేయరన్న విషయంలో చంద్రబాబుకు తెలియకపోవడం శోచనీయం అంటున్నారు. ఇదేనా 40 ఏళ్ల అనుభవం అని చంద్రబాబు గురించి ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు జూమ్ లో ఎక్కువగా ఉంటూ కరోనా టైమ్ లో కన్ఫ్యూజన్ లో ఉన్నాడని ఎద్దేవా చేస్తున్నారు.