Begin typing your search above and press return to search.

కేసినో వ్యవహారంపై విచారణకు చంద్రబాబు డిమాండ్

By:  Tupaki Desk   |   27 Jan 2022 9:30 AM GMT
కేసినో వ్యవహారంపై విచారణకు చంద్రబాబు డిమాండ్
X
ఏపీ మంత్రి కొడాలి నానిపై వచ్చిన ‘కేసినో’ వ్యవహారాన్ని అంత తేలికగా వదిలిపెట్టవద్దని టీడీపీ డిసైడ్ అయ్యినట్టు ఉంది. కొత్త జిల్లాలతో కాస్త డైవర్ట్ అయిన వేడిని తాజాగా చంద్రబాబు రగిలించారు.

మంత్రి కొడాలి నాని, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న వార్ ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు చంద్రబాబు. ఈ పంచాయితీని ఆయన ముందు పెట్టారు.

‘క్యాసినో’ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ కు లేఖ రాశారు. క్యాసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.

కాగా సంక్రాంతి సందర్భంగా నానికి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో, జూదం నిర్వహించారని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవన్నారు.

వాస్తవాలను కనుగొనేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ వెళితే కార్లు ధ్వంసం చేశారని.. తిరిగి తమ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గురువారం గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసింది. ఈ మేరకు గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్ కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్ కు సమర్పించారు.

ఇక గుడివాడ పర్యటనలో తమపై జరిగిన దాడులు, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు. కొడాలి నాని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా తదితరులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు