Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎఫెక్ట్: చిక్కుల్లో కాంగ్రెస్ అగ్రనేత

By:  Tupaki Desk   |   19 Feb 2020 8:43 AM GMT
చంద్రబాబు ఎఫెక్ట్: చిక్కుల్లో కాంగ్రెస్ అగ్రనేత
X
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ కోశాధికారి, గాంధీ కుటుంబానికి నమ్మిన బంటు రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌. ఆయనకు చంద్రబాబు చేసిన పనికి చిక్కుల్లో చిక్కుకున్నారు. చంద్రబాబు వ్యవహారంలో అహ్మద్ పటేల్ కూడా కీలక నాయకుడిగా గుర్తించిన ఐటీ అధికారులు ఆయనను విచారణకు పిలిచారు. అయితే విచారణకు వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో అనారోగ్యం నెపంతో ఆస్పత్రి లో పోయి కూర్చున్నారు. ఈ విషయం అంతగా తెలియలేదు. ఎందుకో ఈ వార్తను కప్పిపుచ్చారో తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడిపడిన అంశం ప్రధాన మీడియా మరుగున పడేశాయి.

తెలుగుదేశం హయాం లో అమరావతి లో భారీ నిర్మాణం పనులు చేపట్టిన ఒక సంస్థ నుంచి దాదాపు రూ.400 కోట్లు అప్పటి అధికార పార్టీ నాయకుల ద్వారా ఆ నగదు ఏకంగా ఢిల్లీకి చేరాయని సమాచారం. అవి కర్నాటకలోని బెంగళూరుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడి ద్వారా ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి చేరాయని అప్పట్లో ఐటీ, ఈడీ బహిరంగంగా వెల్లడించింది. ఈ హవాలా వ్యవహారంతో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధం ఉందనే వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఇటీవల వారం రోజుల పాటు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసం, కార్యాలయాలపై దాడి చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన రికార్డులు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాలను ఈడీ అధికారులు బహిర్గతం చేశారు. అయితే దీనిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్‌ను ఆదాయం పన్ను శాఖ విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గత లోక్‌సభ ఎన్నికల సమయం లో ఆంధ్రా నుంచి హవాలా రూపం లో కాంగ్రెస్ పార్టీకి తరలివచ్చిన 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సమాచారం తెలపాలంటూ ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందించింది. అయితే ఆ నోటీసులను చూసిన ఆయన నలతగా ఉందంటూ, శ్వాస సంబంధమైన సమస్యలున్నాయంటూ ఫరిదాబాద్‌లోని మెట్రో ఆస్పత్రిలో చేరిపోయారు. తాను ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనంటూ అహ్మద్‌పటేల్ ఆదాయపు పన్ను శాఖకు సమాచారం పంపించారు. ఫిబ్రవరి 11 తేదీన జారీ చేసిన సమన్ల ప్రకారం ఆయన ఫిబ్రవరి 14 తేదీన ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన 14 తేదీన ఆదాయపు పన్ను ఆధికారుల ముందు హాజరు కాకుండా తప్పించుకున్నారు. దీంతో ఐటీ రెండోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 18 తేదీన విచారణకు తప్పకుండా హాజరు కావాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో ఆయన విచారణకు వస్తే అరెస్టు చేస్తారనే భయంతో మంగళవారం నేరుగా ఫరిదాబాద్‌ లోని మెట్రో ఆస్పత్రి లో అనారోగ్యం తో బాధ పడుతున్నట్లు చెప్పారు. శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రి లో చేరడంతో తాను విచారణకు హాజరు కాలేనంటూ ఐటీ శాఖ అధికారులకు ఆస్పత్రి బిల్లులతోపాటు లేఖ పంపించారు.

ఈ హవాలా నిధులకు సంబంధించిన వివరాలను ఉన్నది ఉన్నట్టు వెల్లడించే పక్షంలో కొందరు ఆంధ్రప్రదేశ్ తో పాటు పలువురు జాతీయ నాయకులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. చంద్రబాబు చేసిన పనికి అందరూ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఒక్క తీగ లాగితే డొంక మొత్తం కదులుతుండడంతో రాజకీయ నాయకుల్లో కలవరం మొదలైంది.