Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు చికాగో డాక్టర్ సలహా ఇచ్చాడా?
By: Tupaki Desk | 27 April 2020 4:30 PM GMT14 ఏళ్లు సీఎంగా చేసిన పెద్ద మనిషి ఆయన.. దేశానికి ఎంతో మందిని పీఎంలను చేసిన వ్యక్తి ఆయన.. మరి ఈ కరోనా టైంలో ఏపీకి ఇంత కష్టం వస్తే ఎక్కడ దాక్కున్నాడయ్యా అంటే.. పక్క రాష్ట్రంలో.. తన మనవడితో కులాసాగా శేష జీవితం గడిపేస్తున్నాడు. ఎమ్మెల్సీ మరియు కొడుకైన లోకేష్ బాబు హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతుంటే.. మనవడు దేవాన్ష్ ఎంచక్కా స్కేటింగ్ చేస్తున్నాడు. టోటల్ ఏపీ కరోనా కష్టంలో ఉంటే మన బాధ్యత గలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి పట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. దీన్నే వైసీపీ ఎలుగెత్తి చాటుతోంది. ఏపీకి కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు ఎందుకు ఇక్కడి ప్రజలకు భరోసాగా ఉండటం లేదని ఇప్పుడు వైసీపీ దుమ్మెత్తిపోస్తోంది.
కానీ చంద్రబాబు మాత్రం వాటిని సమాధానం ఇవ్వడు. ఇవ్వలేడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయ్యా.. చీప్ గా ఇలాంటి వాటికి సమాధానం ఇస్తాడా? చెప్పండి.. అందుకే వాళ్ల అనుంగ శిష్యులు మాజీ మంత్రుల చేత.. అదీ ఏపీలో ఉన్న నాయకుల చేత సమాధానం ఇప్పిస్తున్నాడు. కానీ పక్కరాష్ట్రంలో కూర్చొని వైసీపీ ప్రభుత్వం మీద బయట నుంచి బండలు వేసే పని భేషుగ్గా చేస్తున్నాడని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆరోపిస్తోంది.
సరేలే పోనీలా పెద్దమనిషి మొన్ననే 70 ఏళ్ల నిండిన ముసాలాయన కరోనాకు భయడపుతాడా అని అనుకుందాం.. అవన్నీ పక్కనపెడితే.. ఇప్పుడు ఏపీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. ఏపీ కష్టాల్లో ఉంది.. కరోనా ప్రబలుతోంది. జనాలు ఇబ్బందిపడుతున్నారు.. అయినా ఎందుకు రావడం లేదు అని ఆలోచన చేస్తే ఓ సీక్రెట్ తెలిసింది. ఇప్పుడు అందరినోట ఇదే గుసగుసగా వినిపిస్తోంది.
ఇంతకీ చంద్రబాబు ఏపీకి ఎందుకు రావడం లేదయ్యా అంటే... ఆ మధ్య చికాగోలో చంద్రబాబు వైద్య చికిత్సలు చేయించుకున్నారు. ఆ చికాగో డాక్టర్ సూచించిన ప్రకారం చంద్రబాబుకు అన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయట.. ముఖ్యంగా బీపీ, షుగర్ ఎక్కువ మోతాదులో ఉన్నాయట.. సో అందుకే మీరు కరోనాకు తట్టుకోలేరు అని ఇంట్లోనే ఉండండని సలహా ఇచ్చాడు అని.. అందులో ఏపీలో ఎక్కువగా ఉన్న కరోనాకు భయపడి అడుగు పెట్టడం లేదని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
60 ఏళ్లు దాటిన వారికి కరోనా డేంజర్. ఇక షుగర్, బీపీ సహా దీర్ఘకాలిక రోగులున్న వారికి కరోనా వస్తే తొందరగాపైకి పోతారు. ఇటలీ, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మరణాల్లో 80శాతం 60ఏళ్ల పైబడిన వారే. అందుకే ఈ 70 ఏళ్ల చంద్రబాబు కరోనాకు భయపడే ఇంట్లోంచి కాలు బయటపెట్టడం లేదని ప్రచారం సాగుతోంది. అన్ని రోగాలు బాడీలో ఇముడ్చుకున్న చంద్రబాబు ఈ టైంలో బయటకొస్తే ఇంకా ఏమైనా ఉందా? అందుకే చికాగో డాక్టర్ సలహా ప్రకారం ప్రస్తుతం ‘కరోనా సెలవులు’ తీసుకొని పక్కరాష్ట్రంలో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తమ అధినేతను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఏపీ టీడీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే వారు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో భద్రంగా బాబు దాచేస్తున్నారు. అదన్నమాట సంగతీ..!