Begin typing your search above and press return to search.

చిన్నారి మృతి పై బాబు ఫైర్ ? త‌ప్పంతా పోలీసుల‌దే !

By:  Tupaki Desk   |   16 April 2022 12:29 PM GMT
చిన్నారి మృతి పై బాబు ఫైర్ ? త‌ప్పంతా పోలీసుల‌దే !
X
ట్రాఫిక్ ఆపి మ‌రీ మంత్రికి స్వాగ‌తం ప‌ల‌కాలి లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయా?అంటే పోలీసులు మాత్రం ఏమీ మాట్లాడ‌రు కానీ నిండు ప్రాణం పోయాక కూడా పోలీసులు త‌మలో పశ్చాత్తాపం లేద‌ని నిరూపించారు.అందుకే ఈ ఘ‌ట‌న‌లో త‌మ త‌ప్పు లేద‌ని చెప్పి పొంత‌న లేని జ‌వాబులు ఇచ్చి, డ్రామా న‌డుపుతున్నారు అన్న విమ‌ర్శ‌లు అందుకుంటున్నారు.

కొన్ని సార్లు అనాలోచిత చ‌ర్య‌లు అత్యుత్సాహ పోక‌డ‌ల కార‌ణంగా అనూహ్య ప‌రిణామాలు సంభ‌విస్తాయి. వాటికి రాజ‌కీయ నాయ‌కులు స్పందించే విధానం, వాటికి వారు బాధ్య‌త వ‌హించే విధానంపైనే ఆధార‌ప‌డి వారి వ్య‌క్తిత్వాలు ఆధారితం అయి ఉంటాయి. ఇందుకు ఎవ్వ‌రూ అతీతులు కారు. కాబోరు కూడా! వైసీసీ వ‌ర్గాలు ఇవాళ సంబ‌రాల పేరిట భారీ ర్యాలీలు నిర్వ‌హిస్తూ ఉన్నాయి.ఆయా సంద‌ర్భాల్లో క‌నీసం అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల‌కు కూడా దారి ఇవ్వ‌కుండా ప్ర‌వ‌ర్తిస్తున్నాయి అన్న ఆరోప‌ణ‌లు విప‌క్షం నుంచి వ‌స్తున్నాయి.

ఇదే మ‌ని అడిగితే వైసీపీ నాయ‌కులు నోటికి వ‌చ్చిన విధంగా తిడుతున్నార‌ని వీరంతా వాపోతున్నారు. నిన్న‌మొన్న‌టి వేళ అనంత దారుల్లో పోలీసుల అతి కార‌ణంగానే ఓ చిన్నారి ప్రాణం పోయింద‌ని టీడీపీ ఆరోపిస్తూ ఉంది. అంతేకాదు కాస్త పోలీసులు చొర‌వ తీసుకుంటే పాప స‌రైన స‌మ‌యానికి ఆస్ప‌త్రికి చేరుకునేద‌ని త‌ద్వారా ప్రాణాలు నిల‌దొక్కుకునేవే అని అంటున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

ఆంధ్రావ‌నిలో కొత్త మంత్రుల సంబ‌రాల సంద‌ర్భంగా చోటు చేసుకుంటున్న విషాద ఘ‌ట‌న‌లు తీవ్ర క‌ల్లోలాల‌కు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా అనంత‌పురం జిల్లా, క‌ల్యాణ దుర్గంలో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌పై రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి. ఆ రోజు మంత్రి ఉషా శ్రీ చ‌ర‌ణ్ పేరిట నిర్వ‌హించిన స్వాగ‌త సంబరాల కార‌ణంగా ముక్కుప‌చ్చ‌లార‌ని ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌కు తావిస్తోంది. ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల శోకానికి అడ్డ‌న్న‌దే లేకుండా ఉంది. ముఖ్యంగా చిన్నారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించే విష‌య‌మై తాము ఎంత శ్ర‌మించినా పోలీసులు అడ్డుకోవ‌డంతో భారీ ర్యాలీలో తాము ఇరుక్కుపోయామ‌ని బాధిత వ‌ర్గాలు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నాయి. తాము పోలీసుల‌ను వేడుకున్నా ఫ‌లితం లేకుండా పోయింద‌ని వాపోతున్నాయి.

ముఖ్యంగా ఈ విష‌య‌మై పోలీసుల తీరుపై ప‌లు అనుమానాలు వ‌స్తున్నాయి. చిన్నారి త‌ల్లీ తండ్రీ చెబుతున్న వివ‌రాలు ఓ విధంగా ఉంటే పోలీసుల వెర్ష‌న్ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. త‌మ పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నా స‌రైన స‌మ‌యంలో అంబులెన్స్ స‌ర్వీసు కూడా రాలేద‌నే అంటున్నారు.

అంతేకాదు డీఎస్పీ స్థాయి అధికారి త‌మ‌కు తోవ ఇవ్వ‌కుండా, ఆపి,ర్యాలీ అంతా వెళ్లిన త‌రువాతే త‌మ‌ను వెళ్లనిచ్చార‌ని,దీంతో పాప ను ఆల‌స్యంగా ఆస్ప‌త్రికి చేర్చాల్సి వ‌చ్చింద‌ని బాధితులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. దీనిపై చంద్ర‌బాబు మాట్లాడుతూ అనంత దారుల్లో చిన్నారి మ‌ర‌ణం త‌న‌నెంతో క‌లిచివేసింద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో పోలీసు వైఫ‌ల్యం ఉంద‌ని ఆరోపించారు.ఇప్పుడు వారు ఏం చెబుతారు అని ప్ర‌శ్నించారు. ట్విట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు స్పంద‌న‌ల‌కు వైసీపీ ఏ విధంగా ప్ర‌తిస్పందించ‌నుందో ?