Begin typing your search above and press return to search.

ఖ‌బ‌డ్దార్ పెద్దిరెడ్డీ.. ఇది బిగినింగ్ మాత్రమే: చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   5 Jan 2023 3:00 PM GMT
ఖ‌బ‌డ్దార్ పెద్దిరెడ్డీ.. ఇది బిగినింగ్ మాత్రమే:  చంద్ర‌బాబు ఫైర్‌
X
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అదినేత చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌కు అడ్డంకులు సృష్టించ‌డంపై ర‌గిలిపోతు న్నారు. నిజానికి చంద్ర‌బాబు జీవితంలో అనేక మంది ముఖ్య‌మంత్రుల‌ను చూశారు. కానీ, చంద్ర‌బాబే చెప్పిన‌ట్టు.. ఎవ‌రూ ఆయ‌న‌ను ఇంత‌గా ఇబ్బంది పెట్టింది లేదు. అంతేకాదు.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ఎవ‌రూ ఆయ‌న‌ను విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంలో న‌డిరోడ్డుపై కూర్చోబెట్టిందీ లేదు. ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో న‌డిపించింది కూడా లేదు. గంట‌ల త‌ర‌బ‌డి రోడ్డుపై నిరీక్షించేలా చేసింది కూడా లేదు.

కానీ, కాలం.. ఖ‌ర్మం .. క‌లిసి రాక‌పోతే.. ఇలానే ఉంటుంది. ఇక‌, ఈ ప‌రిణామాల‌తో సీనియ‌ర్ మోస్ట్ అయిన చంద్ర‌బాబు ర‌గిలిపోతున్నారు.ముఖ్యంగా సీఎం జ‌గ‌న్.. ఆయ‌న కీల‌క వ్య‌క్తి, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి(కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని మొత్తం క‌నుస‌న్న‌ల్లో న‌డిపిస్తున్న‌ది ఈయ‌నేన‌ని అంటారు)పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మంత్రి పెద్దిరెడ్డి ఆగడాలకు అంతేలేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు.

పెద్దిరెడ్డి అరాచకాల్ని సహించేది లేదని, పుంగనూరులోనే దీటైన జవాబిస్తామని స‌వాల్ రువ్వారు. కుప్పం లో పోలీసులపై తెలుగుదేశం కార్యకర్తలే దాడి చేశారన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే శారు. తమ జోలికొస్తే తడాఖా చూపుతామని హెచ్చరించారు. ఈ సంద‌ర్భంగా .. `పెద్దిరెడ్డీ ఖ‌బ‌డ్దార్‌`` అని హెచ్చ‌రించారు. తన రాజకీయ జీవితంలో చాలా మందిని చూశానని చెప్పారు.

ఇప్పుడు రాజకీయాల ముసుగులో ఉన్న నేరస్థులతో పోరాడుతున్నామని చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కుప్పంలో బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను మీడియా ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన త‌మ‌ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

‘‘పెద్దిరెడ్డీ గుర్తు పెట్టుకో.. ఇది బిగినింగ్‌ మాత్రమే. తమాషా ఆటలాడుతున్నావు.. నీ తడాఖా ఏంటో చూస్తా. నేను రెచ్చగొట్టానా? మాపై తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నావు. అధికారంలో ఉన్న 14 ఏళ్లు నేనూ అలాగే అనుకునుంటే నువ్వు జిల్లాలో తిరిగేవాడివా? ఇప్పుడు ఇష్టప్రకారం అరాచకాలు చేస్తారా? కుప్పంలో కప్పం కట్టాలని బెదిరిస్తావా? నువ్వొక రాజకీయ నాయకుడివా? తమాషా అనుకోవద్దు.. వదిలిపెట్టం. కుప్పంలో రౌడీలను ప్రోత్సహిస్తామంటే ఖబడ్దార్‌..!’ అని హెచ్చ‌రించారు.

ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌, వైఎస్‌, ష‌ర్మిల పాద‌యాత్ర‌ల స‌మ‌యంలో తాను అనుమ‌తి ఇచ్చి పోలీసుల భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. త‌న హ‌యాంలో వీరంతా కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువ చ్చార‌ని.. వారిని తాను త‌లుచుకుంటే ఆరోజు అడుగు బ‌య‌ట‌కు పెట్ట‌కుండా చేసేవాడిని కాదా? అని ప్ర‌శ్నించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.