Begin typing your search above and press return to search.
దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా...జగన్ వారికంటే మేధావా : చంద్రబాబు !
By: Tupaki Desk | 28 April 2021 11:30 AM GMTఏపీలో ఓ వైపు కరోనా సెగలు పుట్టిస్తుంటే .. మరోవైపు కరోనా వ్యాప్తి పై రాజకీయం కూడా రోజురోజుకి వేడెక్కుతుంది. ఏపీలో కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీలో కరోనా పాజిటివిటీ రేట్ ఏకంగా 25.9 శాతానికి పెరిగిందని.., ప్రభుత్వ అసమర్ధతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. కరోనాపై తప్పుడు సమాచారమిచ్చి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టుపెట్టొద్దన్నారు. వివిధ దేశాల వైద్య నిపుణుల సహకారంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తమ వంతు సహకరిస్తామని తెలిపారు. పార్టీ పరంగా ఎంతవరకు సాయమందించగలమో అంత వరకూ చేస్తామన్నారు.
కరోనా కట్టడి చర్యల్లో మిగతా రాష్ట్రాలు ముందుటేం.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల కంటే ముందే ఏపీలో మద్యం షాపులు తెరిచిందని విమర్శించారు. థియేటర్లు, రెస్టారెంట్లు సహా అన్నీ తెరవడంతో కరోనా వ్యాప్తి పెరిగింది అని, ప్రభుత్వ వైఫల్యం కారణంగా మృతదేహాలను మోటార్ సైకిల్ పై తీసుకెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉందని , ఇక ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యతపైనా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో 104కి కాల్ చేస్తే 3 గంటల్లో బెడ్ ఇస్తామని ప్రకటించారని, ఇది ఎక్కడైనా ఇస్తున్నారా , అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు తెరవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారన్నారు. విద్యార్థులకు కరోనా సోకడం వల్ల వారి కుటుంబ సభ్యులకూ ప్రాణహాని ముప్పు పొంచిఉదన్నారు. ఇక దేశమంతా పరీక్షలు వాయిదే వేస్తే.. పరీక్షలు పెట్టాలని చూడటం తగదని వ్యాఖ్యానించారు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదని... విద్యార్థులకు రవాణా, ఇతర విధాలుగా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా వేస్తే, జగన్ వారికంటే మేధావా పరీక్షలు పెట్టాలని చెప్తున్నారు అంటూ విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలు తెరిచి 130 మంది ఉపాధ్యాయులు మృతిచెందడానికి కారణమయ్యారని మండిపడ్డారు.వితండ వాదం, మూర్ఖత్వంతోనే రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారని అయన మండిపడ్డారు.