Begin typing your search above and press return to search.

దారుణ ఓట‌మి త‌ర్వాత బాబు పాల్గొనే ప్రోగ్రాం ఇదే!

By:  Tupaki Desk   |   25 May 2019 11:38 AM GMT
దారుణ ఓట‌మి త‌ర్వాత బాబు పాల్గొనే ప్రోగ్రాం ఇదే!
X
న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వాన్ని అప‌హాస్యం చేసేలా.. ఈ దేశంలో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో నేనొక‌డిని అంటూ త‌న గొప్ప‌తనాన్ని త‌న‌కు తానే చెప్పుకునే వ్య‌క్తిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుక‌నిపిస్తారు. నోరు తెరిస్తే.. త‌న గొప్ప‌త‌నాన్ని.. త‌న మొన‌గాడిత‌నాన్ని అదే ప‌నిగా చెప్పుకునే ఆయ‌న మాట‌లు విని.. విని తెలుగు ప్ర‌జ‌ల‌కు బోర్ కొట్టింది.

తాజాగా వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాలు అదే విష‌యాన్ని వెల్ల‌డించాయి. మ‌నం ప్ర‌జ‌ల్ని ఇంతలా బాధ పెట్టామా? ఎన్ని క‌ష్టాల‌కు గురి చేస్తే ఇలాంటి ఫ‌లితాన్ని వారు ఇస్తారంటూ ఆత్మ‌శోధ‌న చేసుకుంటూ.. త‌న‌ను క‌లుసుకోవ‌టానికి వ‌చ్చే నేత‌లతో త‌న ఆవేద‌న‌ను.. ఆక్రోశాన్ని పంచుకుంటున్న ఆయ‌న‌.. బ‌య‌ట‌కు రావ‌టం లేదు.

గెలుపోట‌ములు జీవితంలో మామూలే. అలాంటిది చంద్ర‌బాబు ఈ ఓట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. డీప్ షాక్ లో ఉన్న పార్టీని ప‌ట్టాల మీద‌కు ఎలా తీసుకొస్తారు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదిలా ఉంటే.. దారుణ ఓట‌మి త‌ర్వాత బాబు బ‌య‌ట‌కు వ‌చ్చి పాల్గొనే కార్య‌క్ర‌మం ఏది? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి స‌మాధానం తాజాగా వ‌చ్చేసింది. ఈ నెల 28న ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా గుంటూరులో జ‌రిగే కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబు హాజ‌రు కానున్నారు.

గుంటూరు టీడీపీ కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లోజ‌రిగే కార్య‌క్ర‌మంలో పాల్గొనే ఆయ‌న‌.. ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళి అర్పిస్తారు. అనంత‌రం పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌వుతారు. సాధార‌ణంగా ప్ర‌తి ఏటా ఎన్టీఆర్ జ‌యంతి వేళ మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌టం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే.. ఈసారి ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసింది.

దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల వాద‌న ఏమంటే.. ఎన్నిక‌ల్లో ఓట‌మి విష‌యాన్ని గుర్తించిన చంద్ర‌బాబు తెలివిగా కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దారుణ ప‌రాజ‌యం నేప‌థ్యంలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి కార్య‌క‌ర్త‌లే కాదు నేత‌లూ నిరాశ‌తో ఉంటారు. ఇలాంటివేళ‌.. కార్య‌క్ర‌మం స‌క్సెస్ కాదు. ఈ విష‌యాన్ని కౌంటింగ్ కు ముందే గుర్తించిన బాబు.. ఈ ఏడాది మ‌హానాడును క్యాన్సిల్ చేస్తూ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.