Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు ప్రతిష్టాత్మకం.. వారిని ఓడించే గెలుపు గుర్రాలేవీ..?
By: Tupaki Desk | 18 Jan 2023 6:35 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారిన కొన్ని నియోజకవర్గాలు ఆయనను కలవర పెడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకుని.. పార్టీ పరువునే కాదు.. తన పరువును కూడా నిలబెట్టుకోవాలని.. చంద్రబాబు తలపోస్తున్నారు. అయితే.. ఆయా నియోజకవర్గాల్లో గెలిచి తీరుతాం అనే బలమైన అభ్యర్థులు ఆయనకు లభించడం లేదు. దీంతో చంద్రబాబు ఇప్పుడు నాయకుల కోసం వేట ప్రారంభించారు.
పుంగనూరు, గుడివాడ, పులివెందుల, నగిరి, పెడన, నెల్లూరు సిటీ, సర్వేపల్లి నియోజవర్గాలు చంద్రబాబు కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే.. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ నాయకులు.. ఎమ్మెల్యే లు, మంత్రులు.. చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.
చంద్రబాబునువ్యక్తిగతంగా దూషిస్తూ.. గుడివాడ ఎమ్మెల్యే నాని వార్తల్లో ఉంటున్నారు. తాజాగా పుంగనూరు ఎమ్మెల్యే కమ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బతో పార్టీనే ఇబ్బందిలో పడిపోయింది.
నగిరి ఎమ్మెల్యే కమ్ మంత్రి రోజా కూడా టీడీపీని జోరుగా కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడిని దారుణంగా ఎద్దేవా చేస్తున్నారు. ఇక, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా తరచుగా చంద్రబాబును కామెంట్ చేస్తున్నారు. ఇక, సీఎం జగన్‌ను పులివెందుల గడ్డపై ఓడించాలనేది చంద్రబాబు కల. ఇక, సర్వేపల్లిలోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.
మరోవైపు.. తన ఇంటిపైనే దాడి చేసిన మంత్రి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు బుద్ధి చెప్పాలనేది చంద్ర బాబు వ్యూహం. అదేసమయంలో మాచర్ల ఎమ్మెల్యే.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికి రెండు సార్లు టీడీపీ నేతలను ఇక్కడ అడ్డుకున్నారు.
దీంతో ఈనియోజకవర్గంలోనూ గెలిచి పిన్నెల్లికి పాఠం చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. ఇంత కసి ఉన్నా.. ఇంతగా ఓడించాలని ఉన్నప్పటికీ.. చంద్రబాబుకు కలిసి వస్తున్న నాయకులు లేక పోవడం ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.