Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వైపే కృష్ణ‌య్య‌!... బాబుకు బీసీ షాక్‌ ప‌క్కా!

By:  Tupaki Desk   |   17 Feb 2019 1:55 PM GMT
జ‌గ‌న్ వైపే కృష్ణ‌య్య‌!... బాబుకు బీసీ షాక్‌ ప‌క్కా!
X
తెలుగు నేల‌లో బీసీలంతా టీడీపీ వైపే. ఇది నిన్న‌టిదాకా ఉన్న మాట‌. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. టీడీపీ వెంటే న‌డిచిన బీసీలు ఇప్పుడు త‌మ పంథా మార్చేసుకున్నారు. గ‌డ‌చిన ఐదేళ్ల పాల‌న‌లో టీడీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బీసీల సంక్షేమం కోసం ఏ మేర నిధులు ఖ‌ర్చు పెట్టారో, ఏ మేర ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారో ఓ సారి ప‌రిశీలించుకున్న బీసీలు... టీడీపీ ప‌క్ష‌పాత వైఖ‌రిని అర్థం చేసుకున్న‌ట్టుగానే చెప్పాలి. కాసేప‌టి క్రితం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరు వేదిక‌గా వైసీపీ నిర్వ‌హించిన బీసీ గర్జ‌న‌కు వెనుక‌బ‌డిన కులాల‌న్నీ పోటెత్తాయి. అంతేనా... బీసీల త‌ర‌ఫున అలుపెర‌గ‌ని పోరాటం చేస్తూనే.... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ పై తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి, ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తే సీఎం ఈయ‌నేనంటూ టీడీపీ ఘ‌నంగా ప్ర‌చారం చేసుకున్న బీసీ సంఘాల నేత ఆర్‌. కృష్ణ‌య్య కూడా ఇప్పుడు ఇదే భావ‌న‌తో టీడీపీకి పెద్ద దెబ్బే కొట్టారు. టీడీపీకి ఝ‌ల‌క్ ఇచ్చిన కృష్ణ‌య్య‌.... ఇప్పుడు జ‌గ‌న్ బాట ప‌ట్టారు.

బీసీల‌కు న్యాయం జ‌ర‌గాలంటే వైసీపీ అధికారంలోకి రావాల‌ని, జ‌గ‌న్ సీఎం కావాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లుగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏలూరు బీసీ గ‌ర్జ‌న స‌భ‌లో స్వ‌యంగా పాలుపంచుకున్న కృష్ణ‌య్య‌... ఆ స‌భా వేదిక‌పై నుంచే ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం టీడీపీకి ఏ మేర న‌ష్టం జ‌ర‌గ‌నుంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసింద‌ని చెప్పాలి. అయినా బీసీ గ‌ర్జ‌న‌లో కృష్ణ‌య్య ఏం మాట్లాడార‌న్న విష‌యానికి వ‌స్తే... వైఎస్ రాజశేఖర్ రెడ్డి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి అని, బీసీల కోసం అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని కృష్ణ‌య్య‌ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈరోజు బీసీల పిల్లలు మంచి చదువులు చదువుతున్నారంటే, అందుకు కారణం రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. బీసీల కోసం నాడు తాను చేసిన పోరాటాలపై రాజశేఖర్ రెడ్డి స్పందించారని ఆయ‌న‌ గుర్తు చేశారు.

తన తండ్రి అడుగుజాడల్లో వైఎస్ జగన్ నడుస్తున్నారని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తనకు ఆయన హామీ ఇచ్చారని, పార్లమెంట్ లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ విజయం సాధించి, సీఎం అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని కృష్ణ‌య్య తేల్చి చెప్పారు. ప్రధానిని చాలాసార్లు కలిశానని చెబుతున్న చంద్రబాబు,ఒక్కసారైనా బీసీల రిజర్వేషన్ల కోసం మాట్లాడారా? అని కూడా ఆయ‌న‌ ప్రశ్నించారు. డబ్బులకు, ప్రలోభాలకు, మాటలకు మోసపోవద్దని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కే బీసీలంతా ఓటు వేసి గెలిపించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. కృష్ఱ‌య్య మాట‌లు చూస్తుంటే.. బీసీలు ఈ ద‌ఫా టీడీపీకి ఏ మేర దెబ్బ కొట్టేస్తార‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.