Begin typing your search above and press return to search.
బాబు కోటరీ ఫుల్ ఖుష్!
By: Tupaki Desk | 2 Sep 2016 7:19 AM GMTచంద్రబాబునాయుడు అభిమాన గణం మొత్తం పండగ చేసుకుంటోంది. హైకోర్టులో స్టే రావడం.. చంద్రబాబు సచ్ఛీలతకు - సచ్ఛరిత్రకు నిదర్శనం అన్నట్లుగా ఆయన అభిమానులు పండగ చేసేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు. జగన్మోహన రెడ్డి - తమ ముఖ్యమంత్రిని కేసుల్లో ఇరికించడానికి కుట్ర చేస్తే.. ఆయన చాలా సులువుగా తప్పించుకుంటున్నారంటూ పండగ చేసుకుంటున్నారు. నిజానికి ఒక న్యాయస్థానం లో కేసు విచారణకు వచ్చిన ఆదేశాలు - మరో న్యాయస్థానంలో వాటి మీద స్టే.. ఈ ఉత్తర్వులు అన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా.. ఈ పరిణామాల ద్వారా తెర వెనుక ఏం జరిగి ఉంటుందనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఆ ప్రజలకు అసలు సంగతి అర్థమవుతూనే ఉంటుంది. ఓటుకు కోట్ల రూపాయలు ముట్టజెప్పే కేసులో ముఖ్యమంత్రి స్వరం తేల్చడం గురించి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు వేస్తే.. విచారణకు ఏసీబీ కోర్టు ఆదేశించిందని అందరికీ తెలుసు. ఆ కేసు అక్రమం అని.. ఆ కోర్టు ఆదేశించిన విచారణ ముందుకు సాగకుండా.. ఉత్తర్వులు ఇవ్వాలని.. చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించినప్పుడే.. వ్యవహారంలో ఏదో మతలబు ఉన్నదని.. ముందస్తుగా చంద్రబాబు భయపడుతున్నాడని జనం అనుకోసాగారు.
అయితే హై కోర్టులో మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఒకే కేసులో ఇదివరకు చార్జిషీటు కూడా దాఖలయ్యాక మళ్లీ కేసు ఎలా వేస్తారంటూ ఏసీబీలో పిటిషన్ వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్ కే హైకోర్టు నుంచి ఎదురు ప్రశ్నలు వచ్చాయి. చూడబోతే.. చంద్రబాబునాయుడు హటాత్తుగా సేఫ్ జోన్ లో పడిపోయినట్లయింది. న్యాయస్థానాల పరంగా ఆయన సేఫ్ జోన్ లో పడి ఉండొచ్చు గానీ.. ప్రజలు తెరవెనుక విషయాల గురించి కూడా ఆలోచిస్తూన ఉంటారు కదా.. తమ అంచనాల్లో తాముంటారు కదా... అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.