Begin typing your search above and press return to search.

చంద్రబాబు దిగక తప్పదు...?

By:  Tupaki Desk   |   10 Nov 2021 11:30 AM GMT
చంద్రబాబు దిగక తప్పదు...?
X
చంద్రబాబు జాతీయ నాయకుడు. టీడీపీ కి జాతీయ అధ్యక్షుడు. ఆ పార్టీ ఎన్నికల సంఘం దగ్గర ఒక ప్రాంతీయ పార్టీ గా నమోదు అయింది కదా అంటే అది వేరే విషయం. బాబు మాత్రం జాతీయ నేతే. అందు లో ఏ మాత్రం సందేహం ఎవరికీ అవసరం లేదు. ఇక తెలంగాణా లో పుట్టిన టీడీపీ అక్కడ ఇపుడు ఉందా అంటే అది కూడా ఇపుడు జవాబు చెప్పాల్సిన అవసరం లేని ప్రశ్నగానే చూడాలి. ఏపీలో టీడీపీ అయితే బలంగానే ఉంది. క్షేత్ర స్థాయిలో టీడీపీ పవర్ ఫుల్ గానే చెప్పాలి. అటువంటి టీడీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో వరసబెట్టి ఓడి పోతోంది. ఆ ఓటమి చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం దాకా వచ్చేసింది. కుప్పాన్ని అట్టిపెట్టుకుని బాబు మూడు దశాబ్దాల కు పైగా రాజకీయం చేశారు. ఇప్పటికే ఆయన కుప్పం ఎమ్మెల్యేగానే ఉన్నారు.

అయితే ఒక పద్ధతి ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల్లో కుప్పం లో అన్నీ గెలిచేసిన వైసీపీ కుప్పం మునిసిపాలిటీని కూడా గెలవాలనుకుంటోంది. దాని కోసం అధికార పార్టీ కి ఉన్న అన్ని రకాలైన సదు పాయాలను వాడుకుంటోంది. ఒక విధంగా చంద్రబాబుకు ఘోర పరాభవం ఏంటో చూపించాలని కంకణం కట్టుకుంది. అందులో భాగమే మాజీ మంత్రులను, ఇతర పార్టీ పెద్దలను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం. ఈ పరిణామంతో టీడీపీ భగ్గుమంటోంది. కుప్పం లో ప్రజా స్వామ్యానికి పాతర వేశారని మండిపడుతోంది.

నిజానికి కుప్పం లో ఎలాగైనా గెలవాలన్నది టీడీపీ ఆలోచన కూడా. అది చంద్రబాబు రాజకీయానికి గుండె కాయ లాంటి ప్రాంతం. కనీసం మునిసిపాలిటీ అయినా దక్కించుకోకపోతే క్యాడర్ కి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయని కూడా పార్టీ భయ పడుతోంది. చంద్రబాబు అయితే ఆన్ లైన్ లోనే అంతా కధ నడిపిస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న మజీ మంత్రితో సహా కీలకమైన నాయకులను అరెస్ట్ చేసిన తరువాత టీడీపీకి ఇపుడు అండా దండా కావాలి. అందుకే చంద్రబాబు కుప్పం టూర్ కి రెడీ అవుతున్నారని అంటున్నారు.

చంద్రబాబు ఏ నిముషంలో అయినా కుప్పానికి వస్తారని చెబుతున్నారు. బాబు ఏంటి. ఒక జాతీయ నేత కుప్పానికి రావడమేంటి, మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడమేంటి అన్న డౌట్లు రావచ్చు. వైసీపీ వెటకారం చేయవచ్చు. కానీ సీన్ చూస్తే సీరియస్ గానే ఉంది. బాబు రాక పోతే కుప్పం లో టీడీపీ కి పెను సవాలే ఎదురు కావచ్చు అంటున్నారు. దాంతో చంద్రబాబు స్వయం గా ప్రచారానికి వస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే కుప్పం పాలిటిక్స్ మరింత సంచలనంగా మారుతాయనడమో సందేహమే లేదు.