Begin typing your search above and press return to search.
నేను పోటీకి రాను...మోడీకి చెప్పాలని బాబు తాపత్రయం
By: Tupaki Desk | 7 Dec 2022 12:30 PM GMTచంద్రబాబు రాజకీయంగా చూస్తే ఈ రోజు దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ కంటే కూడా సీనియర్. ఆయన 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆరేళ్ళకు అంటే 2001లో గుజరాతి కి మోడీ ప్రధాని అయ్యారు. ఇక ఉమ్మడి ఏపీతో పోల్చి చూసినా గుజరాత్ చిన్న రాష్ట్రం. పైగా అప్పటికే బాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న నాయకుడు.
ఆయన బలంతో కేంద్రంలో వరసగా మూడు ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. అలాగే దేశానికి ప్రధానులను రాష్ట్రపతులను నిర్ణయించే విషయంలో బాబు ముఖ్య పాత్ర పోషించారు. ఎన్డీయే కన్వీనర్ గా అత్యంత కీలకమైన భూమికను ఆయన పోషించారు. అయితే కాలం ఎపుడూ ఒకేలా ఉండదు, పైగా బాబు ఎంతటి రాజకీయ చాణక్యుడు అయినా కొన్ని విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంతో చేసిన తప్పిదాల మూలంగా ఆయన భంగపడ్డారు. ఉమ్మడి ఏపీలో 1999 తరువాత మళ్ళీ సీఎం కాలేకపోయారు.
ఇక విభజన ఏపీలో మాత్రం ఆయన 2014 ఎన్నికల్లో సీఎం అయ్యారు. ఇక ఆనాడు బీజేపీతో పొత్తు ఉంది. పవన్ కళ్యాణ్ చర్మిష్మాను కూడా ఆయన ఉపయోగించుకున్నారు. ఇలా చంద్రబాబు మోడీతో చేతులు కలిపారు. అయితే రాజకీయంగా మోడీని జూనియర్ అనే ఆయన భావించేవారు అని చెబుతారు. ఇక 2018లో ఆ బంధానికి బీటలు వారడం వెనక అనేక రాజకీయాలు ఉన్నా ఎవరి ఇగోలు వారికి ఉండడంతో మోడీ బాబు వేరు పడ్డారు.
తిరిగి 2024 నాటికి రెండు పార్టీలు కలవాలని బాబు చూస్తున్నారు. అందుకోసం ఆయన చేయాల్సిన ప్రయత్నాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు బాబు జాతీయ స్థాయిలో తిరిగి బీజేపీయేతర ఫ్రంట్ ని కట్టడానికి చూసారు. ఆ విధంగా మోడీకి కన్నెర్ర అయ్యారు. మోడీని మాజీ ప్రధాని చేస్తాను అని ఆనాడు బాబు ఇచ్చిన పవర్ ఫుల్ స్టేట్మెంట్స్ కూడా మోడీకి ఆగ్రహం కలిగించాయని చెబుతారు.
వాటి సంగతి పక్కన పెడితే బాబు సామర్ధ్యం ఆయనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు కూడా మోడీకి బాగా తెలుసు. అందుకే ఆయన బాబు రాజకీయంగా మళ్ళీ పూర్వ వైభవం సాధించేందుకు తన తరఫు నుంచి ఏ మాత్రం సాయం చేయడంలేదు అని అంటున్నారు. కానీ బాబు మారిపోయారు. ముఖ్యంగా మోడీ ఉన్నంతవరకూ జాతీయ రాజకీయ యవనిక మీద తన చూపు కూడా పడదు అని ఆయన చెప్పుకుంటున్నారు.
ఆయన తాజాగా ఢిల్లీ వెళ్ళినపుడు ఇదే విషయాన్ని జాతీయ మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. తనకు ఏపీ ముఖ్యం తప్ప జాతీయ రాజకీయాల మీద ఏ మాత్రం ఆసక్తి లేదని బాబు నొక్కి మరీ చెప్పడం వెనక రాజకీయ వ్యూహమే ఉంది అంటున్నారు. తాను మోడీకి ఎక్కడా పోటీకి రానని, తన పనేంటో తన రాజకీయ క్షేత్రం ఏంటో తనకు పక్కాగా తెలుసు అని బాబు చెప్పడం ద్వారా మోడీకి సందేశం ఇచ్చారని అంటున్నారు. మరో పదేళ్ళ పాటు తాను ఏపీకే పరిమితం అవుతాను అని బాబు ఒకటికి పదిసార్లు చెప్పుకోవడం వెనక బీజేపీ పెద్దలకు ఆ మెసేజ్ చేరాలన్న ఆలోచన ఉంది అంటున్నారు.
ఉదాహరణకు 2024లో ఏపీలో టీడీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా కూడా తాను జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవడానికి చూడనని ఆయన ముందే చెప్పేసుకున్నట్లు అయింది అంటున్నారు. మైర్ మోడీకి బాబు విషయంలో ఏమైనా డౌట్లు ఉంటే జాతీయ మీడియాతో ఆయన జరిగిపిన ముచ్చట్ల ద్వారా అవి క్లియర్ అయినట్లుగా భావించవచ్చా. ఏమో రాజకీయాలు కాదంటే అవును అనిలే అని అంటారు. కాబట్టి మోడీ బాబుని నిజంగా నమ్ముతారా.
ఆ మాటకు వస్తే రేపటి ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దూరంగా ఉండి కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు పుంజుకుంటే ఆ కూటమి వైపు బాబు వెళ్ళి జాతీయ స్థాయిలో చక్రం తిప్పరని గ్యారంటీ ఏముంది. ఇవన్నీ ప్రశ్నలు జవాబులు తగిన సమయంలో వస్తాయి. అందువల్ల బాబుతో సమఉజ్జీగా ఇంకా ఎక్కువగా రాజకీయ వ్యూహాలు రచించే మోడీ ఇలాంటి ప్రకటనలను చూసి నిజంగా నమ్ముతారా. బాబుకు జాతీయ రాజకీయాల మోజుని లేదని అనుకుంటారా. మొత్తానికి అయితే ఆ విషయం మోడీకి వినబడాలని బాబు తాపత్రయం. అది వర్కౌట్ అవుతుందో లేదో కాలమే చెప్పాలి.