Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు చంద్రబాబు రిలీఫ్ ఇచ్చాడట
By: Tupaki Desk | 24 Aug 2018 6:09 AM GMTనందమూరి తారకరామారావు జీవితంలో అత్యంత బాధాకరమైన ఘట్టమేదైనా ఉందంటే.. అది ఆయన అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఎదుర్కోవడమే. సొంత అల్లుడే పార్టీని చీల్చి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కోవడంతో ఎన్టీఆర్ తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికీ ఈ విషయాన్ని తలుచుకుంటే తీవ్ర ఆవేదనకు లోనవుతారు. చంద్రబాబు పేరెత్తితే మండిపోతారు. ఇక తన చరమాంకంలో ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ఎంతగా విమర్శించారో అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబుకు రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చింది కూడా ఎన్టీఆరే అనే విషయమూ విదితమే. ఐతే వాస్తవం ఇది అయినపుడు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినపుడు ఆయనకు చంద్రబాబు రిలీఫ్ ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ పెట్టడం చర్చనీయాంశమవుతోంది.
అందులో ఎన్టీఆర్ వెనుక చంద్రబాబు ఉన్న ఫొటో ఒకటి షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అయితే పెట్టారు కానీ.. రాజకీయ అనుభవం లేకపోవడంతో ఏడాదిలోనే ఆయన ఎన్నో ఒడుదొడుకులను.. కుట్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరడం.. పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా చూసుకోవడం ఎన్టీఆర్ కు పెద్ద రిలీఫ్ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద కుట్రకు సూత్రధారే చంద్రబాబు అయినప్పుడు.. వేరే కుట్రలతో ఎన్టీఆర్ ఇబ్బంది పడుతుంటే ఆయనకు రిలీఫ్ ఇచ్చినట్లు పేర్కొనడం కంటే విడ్డూరమేమైనా ఉంటుందా? జనాలు అన్ని విషయాలూ మరిచిపోయారని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎలా అనుకుంటున్నారో? ఇలాంటి ట్వీట్ చేసే ధైర్యం వాళ్లకు ఎలా వచ్చిందో అంటూ నెటిజన్లు దీనిపై మండి పడుతున్నారు.