Begin typing your search above and press return to search.
మంత్రి పీతల సుజాతకు షాకిచ్చిన బాబు
By: Tupaki Desk | 15 March 2019 11:45 AM GMTటీడీపీ మాజీ మంత్రి పీతల సుజాతకు టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. దీంతో ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన పీతల సుజాతకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. కానీ ఈసారి మాత్రం తొలిజాబితాలో ఆమెను పరిగణలోకి తీసుకోకుండా.. టికెట్ ఇవ్వకుండా షాకిచ్చారు.
పీతల సుజాత స్థానంలో ఈసారి చింతలపూడిలో టీడీపీ కర్రా రాజారావుకు టికెట్ కేటాయించింది.అయితే మంత్రి జవహర్ పై కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా ఆ టికెట్ తనకు కేటాయించాలని సుజాత చంద్రబాబును ప్రాధేయపడినా.. ఫలితం లేకుండా పోయింది. వంగలపూడి అనితకు చంద్రబాబు కొవ్వూరు టికెట్ కేటాయించడంతో సుజాత ఆశలు అడియాశలయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ తొలి జాబితాలో జిల్లాలో ఉన్న 11 స్థానాల్లో టీడీపీ 9 మంది సిట్టింగ్ లకు మరోసారి అవకాశం ఇచ్చింది. కానీ సుజాతకు మాత్రం ఇవ్వలేదు. సుజాతకు టికెట్ ఇవ్వకుండా ఎంపీ మాగుంట వెంకటేశ్వరరావు వర్గం లాబీయింగ్ చేసి వ్యతిరేకించింది. మాగుంట కారణంగానే పీతల సుజాతకు టికెట్ ను బాబు కేటాయించలేదని సమాచారం.
కాగా అవినీతి, వర్గ పోరు నేపథ్యంలోనే చంద్రబాబు కొందరు మంత్రులు, సిట్టింగ్ లకు టికెట్ కేటాయించలేదని సమాచారం. కానీ చంద్రబాబు తీరుపై సుజాత భగ్గుమంది. తనకు బాబు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. రెండోజాబితాలో తనకు టికెట్ కేటాయించకపోతే ఆందోళన చేస్తానని తెలిపింది. ఇప్పుడు బాబు దెబ్బకు పీతల సుజాత భవిష్యత్ ఆందోళనకరంగా తయారైందని ఆమె వర్గీయులు వాపోతున్నారు.