Begin typing your search above and press return to search.
2002లో పదో తరగతిలో ఉత్తీర్ణత 66 శాతమే.. చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయినట్టేనా లోకేష్?
By: Tupaki Desk | 7 Jun 2022 8:30 AM GMTఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో గత 20 ఏళ్లలో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం ఈ ఏడాదే నమోదైందని టీడీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు కావడం జగన్ ప్రభుత్వ వైఫల్యమేనని లోకేష్ అనడంపై ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో 66 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైందని.. మరి అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందినట్టా అని సూటిగానే నిలదీస్తున్నారు.
గత రెండేళ్లుగా కోవిడ్ విజృంభణతో ప్రపంచంలో అన్ని దేశాలు గజగజలాడాయిని.. మనదేశం కూడా అత్యధిక కోవిడ్ కేసులతో ఒక దశలో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని.. రోజుకు లక్ష కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేస్తున్నారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ కోవిడ్ విజృంభణతో ఒకానొక దశలో రోజుకు 25 వేలకుపైగా కేసులు కూడా వచ్చాయని నాటి పరిణామాలను వివరిస్తున్నారు. ప్రజలతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా భారీ ఎత్తున కోవిడ్ బారినపడ్డారని గుర్తు చేస్తున్నారు. గత రెండేళ్లు కోవిడ్ తో అస్సలు పాఠశాలలే ప్రారంభం కాలేదని వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే గత రెండేళ్లు పరీక్షలు కూడా పెట్టకుండానే దిగువ తరగతుల్లో వచ్చిన మార్కులను బట్టి ప్రభుత్వం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు చివరి నాటికి మాత్రమే స్కూళ్లు తెరవడం సాధ్యమైందని, అందులోనూ పూర్తి కోవిడ్ నిబంధనలు, మాస్కు ధరించడం, స్కూళ్లన్నింటినీ శానిటైజేషన్ చేయడానికి మరింత కాలహరణం జరిగిందని అంటున్నారు. తల్లిదండ్రులు కూడా మొదట్లో తమ పిల్లలను కోవిడ్ భయంతో పాఠశాలలకు పంపలేదని వివరిస్తున్నారు. ఇప్పుడు పదో తరగతి రాసినవారు 8, 9 తరగతుల పరీక్షలు రాయలేదని గుర్తు చేస్తున్నారు.
ఆ రెండేళ్ల తరగతులు కోవిడ్ తో కొట్టుకుపోవడమే ఇందుకు కారణమని వివరిస్తున్నారు. దీంతో సహజంగానే 8, 9 తరగతుల్లో ఆయా పాఠ్యాంశాలను నేర్చుకోలేకపోవడంతో పదో తరగతిలో విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల అంశాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయని అంటున్నారు. అంతేకానీ పదో తరగతి ఉత్తీర్ణత తగ్గడానికి జగన్ ప్రభుత్వం ఎలా కారణమవుతుందని నారా లోకేష్ ను నిలదీస్తున్నారు.
పదో తరగతి ఫలితాల్లో 2016లో 94.52 శాతం, 2017లో 91.92 శాతం, 2018లో 94.61 శాతం, 2019లో 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2020, 2021 సంవత్సరాల్లో కరోనాతో పిల్లల చదువులు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. వాస్తవానికి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినా పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని టీడీపీ నేతలే కోర్టుల్లో కేసులు వేశారని గుర్తు చేస్తున్నారు. దీంతో కోర్టు ఒక్క పిల్లవాడికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించిందని.. దీంతో ప్రభుత్వం రిస్కు తీసుకోవడం లేక పరీక్షలను రద్దు చేసిందని వివరిస్తున్నారు.
కాగా 2016, 2017, 2018, 2019ల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. 2016తో పోలిస్తే 2017లో ఉత్తీర్ణత శాతం తగ్గడం గమనార్హమని లోకేష్ కు గుర్తు చేస్తున్నారు. ఏవిధమైన ఆటంకాలు, ఇబ్బంది లేనప్పుడు ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందని నిలదీస్తున్నారు. అంతకంతకూ ఏటా ఉత్తీర్ణత శాతం పెరగాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న 2016, 2017, 2018, 2019ల్లో ఉత్తీర్ణత శాతం 94 శాతం దాటలేదని ఉదహరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో 66.06 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. అప్పుడు ఎలాంటి కోవిడ్ ఇబ్బందులు, ఇతర ఏ సమస్యలు లేవు. అయినా పదో తరగతి ఉత్తీర్ణత చాలా తక్కువగా నమోదైంది. కానీ ఇప్పుడు కోవిడ్ ఇబ్బందులు, తదితర సమస్యలతో ఉన్నప్పటికీ ఉత్తీర్ణత 67.26 శాతంగా నమోదైందని.. ఈ విషయాన్ని నారా లోకేష్ గమనించాలని కోరుతున్నారు.
2019తో పోల్చితే తగ్గింది కేవలం 27.62 శాతం మాత్రమేనని.. దీనికే వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని నారా లోకేష్ ఎలా అంటారని నిలదీస్తున్నారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2018లో 17 బడుల్లో సున్నా ఉత్తీర్ణత నమోదైందని గుర్తు చేస్తున్నారు. ఉత్తీర్ణతశాతం తగ్గడానికి గత రెండేళ్లుగా ఉన్న కోవిడ్ పరిస్థితులే కారణం తప్ప జగన్ ప్రభుత్వం వైఫల్యం అస్సలు కానే కాదని అంటున్నారు.