Begin typing your search above and press return to search.
చంద్రబాబు చాలా లెక్కలు.. గాలానికి బీజేపీ చిక్కుతుందా?
By: Tupaki Desk | 25 Dec 2022 12:30 AM GMTఈసారి ఏపీ రాజకీయం రసవత్తరంగా మారనుంది. బీజేపీతో జోడీ కడితే తన గెలుపు నల్లేరు పై నడకే అనే భావనతో ఉన్న చంద్రబాబు పద్మవ్యూహాన్ని రచించారు. ఖమ్మం సభను నిర్వహించి 'ఇదుగో తెలంగాణలో నా బలం'అని బిజెపికి మెసేజ్ పంపారు. తెలంగాణలో రెక్కలు తొడుక్కుంటున్న మీకు తన అవసరం ఉందంటూ మోదీకి చెప్పకనే చెప్పారు.. తెలంగాణలో బీజేపీ, టీడీపీతో జత కడితే ఏపీలో లైన్ క్లియర్ అయినట్టే అనేది టీడీపీ అధినేత భావన.. మరి ఆయన రాజకీయ చదరంగం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే..
-చంద్రబాబు చదరంగం...
స్వయం ప్రకాశితం కానీ చంద్రుడు ఈసారి ఎలాంటి రాజకీయ చదరంగం ఆడనున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ తో కలిసి సర్వ శక్తులూ కూడగట్టారు. అయినా ఫలితం దక్కకపోవడంతో సైలెంట్ అయిపోయారు. దీనిని మనసులో పెట్టుకున్న మోదీ చంద్రబాబుతో అంటీ అంటనట్టు ఉంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తామంటూ ఏపీ బీజేపీ ఘంటాపథంగా చెబుతూ స్నేహ హస్తాన్ని కొనసాగిస్తోంది. మరో వైపు పవన్ కళ్యాణ్ తో కలిసి అడుగులు వేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బిజెపి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీని తన దారిలోకి తెచ్చుకునేందుకు మరో వజ్రాయుధాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు.
-గత తప్పిదమే కష్టాలకు కారణం..
2019 ఎన్నికల్లో మోదీని ఓడించడానికి కేంద్రంలో సర్వశక్తులూ ఒడ్డారు. చంద్రబాబు వేసిన ఈ తప్పటడుగులే ఇప్పుడు కొంత అవరోధాలను కలిగిస్తున్నాయి. ఏపీలో వైసీపీపై నెగ్గాలంటే ఇంకా బలాన్ని కూడగట్టాల్సిందే.. రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో ముందే అంచనా వేయగలిగిన చంద్రబాబు బహిరంగంగానే పవన్ కళ్యాణ్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. అయినప్పటికీ సొంత బలం ఎంత ఉందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఎన్నికల పోరులోకి దిగిన పవన్ కళ్యాణ్ 6.78 శాతం ఓట్లు సాధించి ఓట్లు చీలికకు కారణమయ్యారు. ఈసారి అదే పొరపాటు పునరావృతం కాకుండా ఉండాలనే కార్యదీక్షకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎలాగైనా బీజేపీతో పాటు సేనాని మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వీడని విక్రమార్కుడిలా చేస్తున్న పోరాటానికి అద్భుతమైన ఫలితాలు సాధించకపోయినప్పటికీ ఓటింగ్ శాతం మాత్రం పెంచుకోగలిగారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పొందిన 19 శాతం ఓటింగ్ లో కనీసం 18 శాతాన్నిఅయినా సాధించే అవకాశం ఉంది. జనసేన పార్టీ ఓటింగ్ శాతం టీడీపీకి ఉన్న 39 శాతానికి జత చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. అందుకే చంద్రబాబు బీజేపీ, జనసేన పార్టీతో జత కట్టడానికి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.
-ఖమ్మం సభపై ఆశలు..
బీజేపీతో ఉన్న చిన్న పాటి విభేదాన్ని జయించగల్గితే ఇక వైసిపిని ఓడించడం పెద్ద పెద్ద విషయమేమీ కాదన్నది చంద్రబాబు లెక్క. చంద్రబాబు దీని కోసం పద్మవ్యూహాన్నే సిద్ధం చేసుకున్నారు. అదే ఖమ్మం బహిరంగ సభ.. ఖమ్మం నా గుమ్మం అనే పల్లవితో చేపట్టిన సభ ఎంతో కొంత సక్సెస్ అయ్యింది. ఇది బీజేపీకి ఎంతో కొంత మేలు చేసే కార్యక్రమమే.. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ బలపడటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే తెలంగాణలో తన బలం ఏమిటో తెలియజెప్పడానికే 8 ఏళ్ల తర్వాత చంద్రబాబు సభను నిర్వహించి క్షేత్ర స్థాయిలో తనకు ఇంకా కేడర్ ఉందంటూ బీజేపీకి మెసేజ్ పంపారు. తెలంగాణలో బీజేపీకి దగ్గరయ్యి ఏపీలో సాన్నిహిత్యం కోరేందుకు వ్యూహం రచించారు. ఎందుకంటే బీజేపీని ఒప్పించగల్గితే 99 శాతం సక్సెస్ అయినట్టే.. తరువాత పవన్ ను ఒప్పించడం అంత కష్టమేమీ కాదు.. మరోవైపు వైసీపీ కూడా ముందస్తు వ్యూహంతోనే ఉంది. బీజేపీని దూరం చేసుకోకుండా మోదీకి సానుకూలంగానే వ్యవహరిస్తోంది. మరి ఈ రాజకీయ ఎత్తుగడల మధ్య బీజేపీ, పవన్ కల్యాణ్.లకు చంద్రబాబు ఎలా దగ్గరవుతారనేదే అంతు చిక్కని ప్రశ్న..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.