Begin typing your search above and press return to search.
బాబును వ్యతిరేకించేవాళ్లు.. ఆయన చేసిన పనికి ఫిదా
By: Tupaki Desk | 16 Aug 2021 3:55 AM GMTతెలుగు రాష్ట్రాలు.. ఆ మాటకు వస్తే దేశ చరిత్రలోచాలామంది రాజకీయ నేతలు ఉండొచ్చు కానీ.. కాలానికి అడ్డంగా దొరికిపోయిన అధినేత ఎవరైనా ఉన్నారంటే.. ఆ పేర్లలో ముందు వరుసలో కనిపిస్తారు చంద్రబాబు. ఎవరెన్ని తప్పులు చేసినా.. వారు చేసిన తప్పులు లెక్కలోకి రావు కానీ.. చంద్రబాబు చేసినవి మాత్రం పదే పదే ప్రస్తావిస్తూ.. ఆయన ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేయటం కనిపిస్తుంది. అసలేం జరిగినా కూడా.. ఇదంతా చంద్రబాబు కారణంగానే అంటూ అలవోకగా అనేస్తుంటారు.
కామెడీ ఫోటోలు ఏవైనా.. ఎలాంటి సందర్భానికైనా బ్రహ్మానందం ఫోటో ఎంతలా సూట్ అవుతుందో.. చంద్రబాబు పేరు కూడా రాజకీయాలకు సంబందించి..నెగిటివ్ విషయాలకు సంబంధించి సూటయ్యేలా చేస్తారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. తాను సమర్థుడే అయినా.. ఆయన్ను ఎగతాళి చేసే వారిని నిలువరించే సత్తా బాబు బ్యాచ్ కు లేకపోవటం ఒక పెద్ద లోటుగా చెప్పాలి. పచ్చ మీడియా అంటూ ఆయనకు దన్నుగా నిలిస్తుందని బద్నాం చేసే రాజకీయ పార్టీ నేతలకు అండగా నిలిచే మీడియాల గురించి మాట వరసకు అనరు. బాబు వార్త అన్నంతనే పచ్చవార్త అన్నట్లుగా ముద్ర వేయటంలో ఆయన ప్రత్యర్థులు విజయం సాధించారనే చెప్పాలి.
పచ్చ మీడియా అంటూ బద్నాం చేసే వారి గూబ గుయ్యమనేలా.. బాబును అభిమానించే వారు తిరిగి కౌంటర్ ఇవ్వటంలో ప్రదర్శించే అసమర్థతకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి వస్తుంది. విషాదకరమైన విషయం ఏమంటే.. నాయకులు అన్న తర్వాత బలాలు.. బలహీనతలు.. తప్పులు.. ఒప్పులు అన్ని ఉంటాయి. చంద్రబాబు దగ్గరకు వచ్చేసరికి ఆయన తప్పుల్ని మాత్రమే పెద్ద ఎత్తున ఎత్తి చూపుతారు తప్పించి.. ఒప్పుల్ని మాత్రం కనీస స్థాయిలో కూడా కనిపించకుండా చేయటం కనిపిస్తుంది.
అలాంటి చంద్రబాబుకు సంబంధించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. దీని ప్రత్యేకత ఏమంటే.. చంద్రబాబును తిట్టేవారు..తప్పు పట్టే వారు సైతం బాబు మంచి పని చేశారని చెప్పటం. తనను తీవ్రంగా వ్యతిరేకించే వారిని సైతం మెచ్చుకునేలా బాబుఏం చేశారన్నది చూస్తే.. ఆయన్ను విపరీతంగా అభిమానించే వీరాభిమాని బొప్పన రాఘవేంద్ర రావు. కృష్ణా జిల్లా ప్రసాదంపాడుకు చెందిన ఆయనకు బాబు అంటే ప్రాణం.
అలాంటి ఆయన వయోభారంతో తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బతకాలన్న ఆశ కంటే కూడా.. తాను విపరీతంగా అభిమానించే తన అభిమాన నాయకుడు చంద్రబాబును చూడాలన్నదే తన చివరి కోరికగా కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో.. ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబుకు ఈ విషయాన్ని తెలియజేయగలిగారు. బొప్పన గురించి సమాచారం అందే సమయానికి హైదరాబాద్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
తన ప్రయాణాన్ని కాసేపు పక్కన పెట్టేసిన బాబు.. తన కాన్వాయ్ ను నేరుగా రాఘవేంద్రరావు చికిత్స పొందుతున్నఆసుపత్రికి మళ్లించారు. అక్కడ తనను అభిమానించే బొప్పన రాఘవేంద్రరావును కలిసి.. పరామర్శించి.. ఆయన కోలుకోవాలని కోరుకున్నారు. చంద్రబాబును చూసినంతనే సదరు వీరాభిమాని విపరీతమైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వాతావరణం ఎమోషనల్ గా మారినట్లు చెబుతున్నారు. బాబు చేసిన పనిని ఆయన అభిమానులు అభినందించటం మామూలే. కానీ.. ఆయన్ను వ్యతిరేకించే వారు సైతం బాబు మంచి పని చేశారని మెచ్చుకోవటం గమనార్హం.