Begin typing your search above and press return to search.
నేరుగా జగన్ ఇలాకాలోనే ల్యాండ్ అయిన బాబు... ?
By: Tupaki Desk | 23 Nov 2021 10:30 AM GMTచంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతు బట్టవు. ఆయనలోని గొప్ప విషయం ఏంటి అంటే పోరాడే తత్వం. ఆయన ఏ రోజూ కూడా ఓటమికి వెరచి వెనక్కి పోలేదు. చంద్రబాబుకు అదే శ్రీరామ రక్షగా ఈ రోజు వరకూ నిలిచింది. నిజానికి నాయకుడు అన్న వాడు వెన్ను చూపెడితే క్యాడర్ బెంబేలెత్తిపోవడం ఖాయం.
అలా నాలుగు దశాబ్దాల పాటు ఇదే తీరులో కొనసాగిన చంద్రబాబు తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలో తన సతీమణి భువనేశ్వరిని వైసీపీ నేతలు నానా మాటలు అన్నారన్న దాని మీద కంటతడి పెట్టుకున్నారు. దాంతో టీడీపీ క్యాడర్ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రోజు నుంచి నేటి వరకూ బాబుకు జరిగిన దాని మీద అంతటా సానుభూతి అలా వెల్లువలా కురుస్తూనే ఉంది.
ఈ నేపధ్యంలో హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు ఇపుడు డైరెక్ట్ గా జగన్ సొంత జిల్లా కడపలో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబుకు అదరహో అన్న రేంజిలో క్యాడర్ నుంచి ఘన స్వాగతం లభించింది.
చంద్రబాబు ఎన్నో సార్లు కడప వచ్చారు. కానీ ఈసారి ఆయన రాక ప్రత్యేకం. పైగా జగన్ సర్కార్ బాబుకు ఎంతగానో హ్యుమిలేషన్ కి గురి చేసి చివరికి కంట నీరు తెప్పించింది అన్నది ఏపీ మొత్తం దావానలంగా వెళ్ళిపోయిన తరువాత చంద్రబాబు వస్తే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన కడప సైతం బాబు వెంట నడవడం విశేషంగానే చూడాలి.
చంద్రబాబుని చూడడానికి ఆయనతో కలసి అడుగులు వేయడానికి టీడీపీ క్యాడర్ ఉత్సాహపడింది. పెద్ద ఎత్తున హడావుడి కూడా చేసింది. దీంతో కడప ఎయిర్ పోర్టు పసుపు మయం అయింది. నిజంగా చంద్రబాబు కానీ టీడీపీ వారు కానీ ఊహించని రెస్పాన్స్ ఇది.
రాయలసీమలో వరదలు కారణంగా నష్టపోయిన జనాలని పరామర్శించడానికి బాబు మూడు రోజుల పాటు టూర్ పెట్టుకున్నారు. ఇక శుభారంభమే అదిరింది కాబట్టి మూడు రోజులూ బాబు చేసే టూర్ లో జనాదరణ బాగానే ఉండే అవకాశం ఉంది. మొత్తానికి బాబు తగ్గేదిలే అంటూ జగన్ సొంత జిల్లానే ఎంచుకుని వరద ప్రభావ ప్రాంతలాలో పర్యటన చేయడం రాజకీయంగా చూసుకుంటే జగన్ కి గట్టి సంకేతమే పంపారనుకోవాలి.