Begin typing your search above and press return to search.

అమెరికన్‌ సూట్లతో... అచ్చతెలుగు మీటింగా?

By:  Tupaki Desk   |   13 April 2016 4:09 AM GMT
అమెరికన్‌ సూట్లతో... అచ్చతెలుగు మీటింగా?
X
మన రాష్ట్రంలో పెట్టుబడులకు విదేశీ ఐటీ కంపెనీలను ఆహ్వానించడం అంటే అలాంటి మీటింగ్‌ ఎంత ప్రొఫెషనల్‌ గా ఉండాలి. అమెరికానుంచి ఐటీ కంపెనీలను ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానించడం అంటే.. మన ప్రజెంటేషన్‌ - ఎప్రోచ్‌ కూడా అదే స్థాయిలో ఉండాలి. అవతలి ఐటీ కంపెనీల ప్రతినిధులు కూడా కార్పొరేట్‌ రంగాల్లో ఉన్నతస్థాయికి చెందిన వారే గనుక.. సాధారణంగా ఇలాంటి మీటింగులో ఇంగ్లిషులోనే.. వారి స్థాయిలోనే జరుగుతుంటాయి. కానీ.. ఏదో రచ్చబండ వద్ద ముచ్చట్లు మాట్లాడుకున్నట్లుగా మనదైన తెలుగులో మాట్లాడుకోదగినవి కాదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో అమెరికాలోని అనేక ఐటీ కంపెనీల యాజమాన్యాలు సభ్యులుగా ఉండే ఐటీసర్వ్‌ కన్సార్టియంతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినప్పుడు.. ఆ మీటింగ్‌ అంతే ప్రొఫెషనల్‌ గా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు కానీ.. అచ్చతెలుగు ముచ్చట్లుగా సాగుతుందని ఊహించరు. కానీ చంద్రబాబు దానిని ఏదో పార్టీ మీటింగులాగా - జిల్లా శ్రేణులతో వీడియో కాన్ఫరెన్సులాగా - ఎన్నారై తెలుగు కుర్రాళ్లతో ముచ్చట్లలాగా తేల్చేశారు.

ఐటీ సెర్వ్‌ కన్సార్టియం అనేది కేవలం తెలుగు వారికి సంబంధించింది కాదు. అన్ని భారతీయ - విదేశీ భాషలకు చెందిన వారు యజమానులుగా నడిచే ఐటీ కంపెనీలు అన్నీ కలిపి ఏర్పాటుచేసుకున్న కన్సార్టియం అది. పైగా చంద్రబాబునాయుడు తాను టముకు వేసుకున్న ప్రకారం.. 400 మంది ప్రతినిధులు ఉన్న అతిపెద్ద కన్సార్టియం ఐటీసెర్వ్‌ అని కూడా చెప్పుకున్నారు. ప్రవాస భారతీయుల సేవలు - పెట్టుబడుల సలహాదారుగా ప్రభుత్వంతో మంతనాలు నెరపే వేముల రవికుమార్‌ - సీఎం ఆఫీసు ఉన్నతాధికారులు అంతా ఇందులో పాల్గొన్నారు.

అయితే సంభాషణలు మాత్రం సాంతం తెలుగులో సాగడం కొందరిని విస్మయపరిచింది. ఏపీలో కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన సదుపాయాల గురించి వారు అడగడమూ.. అన్నీ చేసేస్తాం అంటూ చంద్రబాబు చెప్పేయడం.. అంతా ఏదో మొక్కుబడిగా విదేశీ ఐటీ కన్సార్టియంతో ఓ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించినట్లుగా ఖాతా లో చెప్పుకోవడానికి మాత్రమే అన్నట్లుగా జరగడం గమనార్హం.

అదే సమయంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌.. ఇలాంటి ఐటీ కంపెనీలతో సమావేశాలు నిర్వహించినప్పుడు వాటిని ఎంత ప్రొఫెషనల్‌ గా డీల్‌ చేస్తారో చూసి ఏపీ నాయకులు కూడా నేర్చుకోవాలి. చంద్రబాబునాయుడు కు ఉన్న 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఎవరూ కాదనరు.. కానీ కేటీఆర్‌ నుంచి అయినా ఆయన కార్పొరేట్‌ కంపెనీలతో ప్రొఫెషనల్‌ ఎప్రోచ్‌ ను నేర్చుకుంటే అది తప్పేమీ కాదని తెలుసుకోవాలి.