Begin typing your search above and press return to search.

తెలంగాణ పై చంద్రబాబు మళ్లీ మొదలెట్టాడు

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:18 AM GMT
తెలంగాణ పై చంద్రబాబు మళ్లీ మొదలెట్టాడు
X
‘‘మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ను ఇంజినీరింగ్ చదవమంది నేనే.. హైదరాబాద్ కట్టిందే నేనే.. ఏపీని అభివృద్ధి చేసిందే నేనే.. స్వాతంత్ర్య ఉద్యమం లో గాంధీజి ని ఉప్పు సత్యాగ్రహం చేయమంది నేనే..’’ ఇలా చంద్రబాబు నోటి నుంచి జాలువారిని ఆణిముత్యాల్లాంటి మాటలను విని ఆయన ప్రత్యర్థులు, నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇప్పుడు మరోసారి నవ్వుకునే సమయం వచ్చిందుల్లా.. రెడీగా ఉండండి నవ్వడానికి.. రెడీ 1... 2....3..

చంద్రబాబు తన ధర్మపత్ని భువనేశ్వరితో కలిసి ఈరోజు రాజధాని మార్చవద్దంటూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించడానికి అమరావతి బయలుదేరారు. ఇక మధ్యలో గుడులు, గోపురాలు తిరుగుతున్నారు. బెజవాడ కనక దుర్గను మొక్కుకొని జగన్, మంత్రుల బుద్ది మారాలని.. బహుషా తన అమరావతి భూములు జాగలు మారకుండా ఉండాలని వేడుకుంటున్నట్టున్నాడు..

ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఓ ఆసక్తికర మాట ను రైతులతో సమావేశం లో చెప్పుకున్నారు.. ‘తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి తన విజనే కారణమని’ గొప్పలు చెప్పుకున్నారు. యావత్ తెలంగాణ అభివృద్ధి తన విజన్ వల్లే జరిగిందని బీరాలకు పోయారు. ఇలా ఇప్పటికీ వరకూ అన్నింటికి తానేనని చెప్పిన బాబు గారు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని కూడా తన ఖాతాలో వేసుకొని పాపం కేసీఆర్ చేసిన కృషిని కూడా హైజాక్ చేయడం విశేషం.