Begin typing your search above and press return to search.
అన్ని మోజులు తీర్చేసుకుంటున్న బాబు!
By: Tupaki Desk | 15 May 2019 10:33 AM GMTఅధికారం చేతికి రావటం ఇంత కష్టమా? అన్న విషయం 2004 ఎన్నికలకు ముందు చంద్రబాబుకు పెద్దగా తెలీదనే చెప్పాలి. మామ కుర్చీని లాగేసుకోవటం.. ఆ తర్వాత టర్మ్ ను డిఫాల్ట్ సీఎంగా ఉండిపోయిన ఆయనకు 2004లో వైఎస్ పుణ్యమా అని భారీ సవాలే ఎదురైంది. ఆ సవాల్ కు కళ్లు తేలేసిన చంద్రబాబు.. 2009లో కిందా మీదా పడినా ఆయన సీఎం కాలేకపోయారు.
తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉండి.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా సాగిన చంద్రబాబుకు.. సీఎం సీటును ప్రజల మనసుల్ని గెలుచుకొని సొంతం చేసుకోవటం ఎంత కష్టమో తెలిసిందని చెప్పాలి. రాష్ట్ర విభజనతో పాటు.. బీజేపీ.. జనసేనలతో కలిసి కిందామీదా పడితే కానీ సీఎం పదవి చేతికి రాలేదు బాబుకు. ఇంత కష్టపడితే వచ్చిన అధికారాన్ని చేజేతులారా చెడగొట్టుకోవటంలో బాబు తర్వాతే ఎవరైనా అన్న మాట పలువురు నోట వినిపిస్తోంది.
మోడీతో కటీఫ్ మొదలు.. పాలనా పరంగా బాబు చేసిన తప్పులు ఆయన్ను ఓటమికి గురి చేసే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందున్న కాన్ఫిడెన్స్ పోలింగ్ పూర్తి అయిన నాటి నుంచి తగ్గుతుందన్న మాట వినిపిస్తోంది. తాజాగా బాబు చేస్తున్న వ్యాఖ్యలన్ని మేకపోతు గాంభీర్యమేనని చెబుతున్నారు. మహానాడు రద్దు చేయాలన్న ఆలోచన.. ఓటమికి బాబు ఎంత దగ్గరగా ఉన్నారన్న విషయాన్ని చెప్పేస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న విడుదల కానున్న నేపథ్యంలో.. చేతిలో ఉన్న చివరి రోజుల్లో సీఎంగా తనకున్న మోజుల్ని తీర్చేసుకునేందుకు బాబు ట్రై చేస్తున్నట్లు చెప్పక తప్పదు. కోడ్అమల్లో ఉన్నా క్యాబినెట్ మీటింగ్ కోసం బాబు చేసిన ప్రయత్నం దీనికో ఉదాహరణగా చెప్పాలి. ఈసీకి చెప్పినట్లుగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించకపోతే.. కొంపలేమీ మునగవు. కానీ.. ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ మీటింగ్ ను నిర్వహించటం ద్వారా తన మోజు తీర్చుకున్న చంద్రబాబు.. తాజాగా మీడియా మొఘల్ రామోజీరావును ఫిలింసిటీలో వచ్చి కలవటం కూడా అలాంటిదేనని చెబుతున్నారు.
రాజకీయ వ్యూహం కోసం చర్చలు జరిపేందుకు వచ్చినట్లుగా మాటలు వినిపిస్తున్నా.. తనకు అత్యంత ఆఫ్తుడైన మీడియా అధినేతను సీఎం హోదాలో ఒకసారి పలుకరించి పోవాలన్న ఉద్దేశంతోనే తాజా ట్రిప్ వేసినట్లుగా చెబుతున్నారు. కావాలంటే రానున్న రోజుల్లో ఇలాంటివి చాలానే చంద్రబాబు చేసే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మళ్లీ సీఎంగా అవకాశం ఎప్పటికి వస్తుందో తెలీని వేళ.. చేతిలో ఉన్న పవర్ తో తనకున్న మోజుల్ని తీర్చుకోవాలని బాబు భావించటం తప్పు కాదేమో?