Begin typing your search above and press return to search.
ఇది కడప కాదు కుప్పం.. ఖబడ్డార్ చక్రవడ్డీతో సహా తిరిగిస్తా!
By: Tupaki Desk | 25 Feb 2021 1:10 PM GMTఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు (గురువారం) తాను ప్రాతినిధ్యం వహించే కుప్పం పర్యటన చేపట్టారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున విజయం సాధించటం సంచలనంగా మారింది. బాబుకు అడ్డా అయిన కుప్పంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో.. టీడీపీ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అధికారపక్షం చేస్తున్న వాదనల్ని కొట్టిపారేస్తున్నారు చంద్రబాబు. అధికారపక్ష మద్దతుదారులు పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించారన్న ప్రచారంలో నిజం లేదన్నారు.
తాము బలపర్చిన అభ్యర్థుల్ని అన్ని విధాలుగా భయపెట్టారని.. దౌర్జన్యాలు జరిపించి విర్రవీగుతున్నారన్నారు. ఇవన్నీ తాను గుర్తు పెట్టుకుంటున్నానని.. వడ్డీ కాదు చక్రవడ్డీతో సహా తిరిగి ఇస్తానని ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు. తాను ఇదే రీతిలో ఉండి ఉంటే.. ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా? అని మండిపడ్డరు. తాను కక్ష సాధింపు చర్యలు ఎప్పుడూ చేయలేదని.. మరో ఏడాదిన్నరలోనే ఎన్నికలు రానున్నట్లు చెప్పారు.
కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని.. తాను అన్ని గుర్తు పెట్టుకుంటానన్నారు. కుప్పంపై కక్ష కట్టి.. అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ''భయపెడితే భయపడటానికి ఇది పుంగనూరు.. కడప కాదు. ఇది కుప్పం ఖబడ్డార్ గుర్తుపెట్టుకండి.. మీ ఆటలు ఇక్కడ కావు'' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తలు అధైర్య పడొద్దని.. అండగా ఉంటానని.. తరచూ కుప్పం వచ్చి సమస్యలు తెలుసుకుంటామని అక్కడి వారికి చంద్రబాబు మాట ఇచ్చారు. మరి.. ఆయన చెప్పినట్లే తరచూ వస్తారా? అన్నది చూడాల్సిందే.