Begin typing your search above and press return to search.

భాదపడుతున్న బాబు ...ఆనందంలో సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   21 Dec 2019 10:51 AM GMT
భాదపడుతున్న బాబు ...ఆనందంలో సీఎం జగన్ !
X
ఏపీ రాజధాని విషయంపై జీఎన్ రావు కమిటీ తమ నివేదికని సీఎం జగన్ కి శుక్రవారం సాయంత్రం అందించిన విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్టుగానే, సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పిన విధంగానే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని జీఎన్ రావు కమిటీ తమ సిఫార్సుల్లో తెలిపింది. అమరావతిలో హైకోర్టు బెంచ్, సచివాలయం, రాజ్ భవన్ ఏర్పాటు చేసుకోవాలని... ఆ రకంగా అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్’గా కొనసాగుతుందని ఆయన తెలిపారు.

అలాగే విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. వేసవి కాలంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీసును నిర్మించాలి. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నందును కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఈ కమిటీ తెలిపింది. పరిపాలనా సౌలభ్యం కోసం కర్ణాటక తరహాలో కమిషనరేట్ విధానాన్ని అవలంభించాలి. రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తర కోస్తా , మధ్య కోస్తా , దక్షిణ కోస్తా , రాయలసీమగా పరిపాలన విభజన చేసుకోవాలి అని తెలిపింది.

అయితే దీనిపై నిన్నటి నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు సీఎం జగన్ పై ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో కర్నూల్ ప్రాంత ప్రజలు, విశాఖ ప్రజలు మాత్రం ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కలలని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా బద్దలు కొట్టింది. సింగపూర్ , డెట్రాయిట్ తరహాలో లేదా ఇస్తాంబుల్ తరహాలో పూర్తిగా కొత్త నగరాన్ని నిర్మించటానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి చాలా గొప్పగా ప్రారంభించారు. కానీ , ఐదేళ్ల కాలంలో అయన చేసిందేమి లేదు. కేవలం గ్రాఫిక్స్ తోనే కాలం గడిపి మళ్లీ ..ఎన్నికలకి వెళ్లడంతో బాబు ఏపీ ప్రజలు తగిన బుద్ది చెప్పారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ ..రాజధాని ఒకే చోట కాకుండా ..మూడు చోట్ల పెట్టడం ద్వారా ..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. నిపుణుల కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో .. దాదాపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం వైపే అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. దీనితో బాబు కల గన్న సింగపూర్ అంటే కొంచెం కష్టమే దీనితో చంద్రబాబు భాదపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు నేడు సీఎం జగన్ తన 47వ పుట్టిన రోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే.