Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో సూప‌ర్ టెక్నాల‌జీ

By:  Tupaki Desk   |   2 March 2017 10:05 AM GMT
ఏపీ అసెంబ్లీలో సూప‌ర్ టెక్నాల‌జీ
X
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిలో కొత్త‌గా శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి భ‌వ‌నాలు సిద్ధ‌మైపోయాయి. కాపేప‌టి క్రితం సీఎం నారా చంద్ర‌బాబునాయుడు - అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ - మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి లాంఛ‌నంగా ప్రారంభించారు. వారం క్రిత‌మే అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయాలు ప్రారంభ‌మైనా... శుభ ముహూర్తం చేసుకున్న చంద్ర‌బాబు స‌ర్కారు... దానికి ప్రారంభోత్స‌వం చేశారు. హైద‌రాబాదులోని అసెంబ్లీ - మండ‌లి భ‌వ‌నాలు రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తెలంగాణ‌కు వెళ్లిపోగా... ఏపీ మాత్రం కొత్త రాజ‌ధానిలో కొత్త‌గా క‌ట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ - మండ‌లి స‌మావేశాలు ఇక్క‌డే జ‌ర‌గ‌నున్నాయి. ఇక‌పై ఏపీకి సంబంధించిన అసెంబ్లీ, మండ‌లి వ్య‌వ‌హారాల‌న్నీ కూడా ఇక్క‌డే జ‌ర‌గ‌నున్నాయి. ఈ వ్య‌వ‌హారాల కోసం హైద‌రాబాదుకు వెళ్లాల్సిన అవ‌స‌మేమి ఉండ‌దు.

ఇక అసెంబ్లీ, మండ‌లి భ‌వ‌నాల విశేషాల‌ను ప‌రిశీలిస్తే... ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. స‌మావేశాల్లో భాగంగా అధికార‌, విప‌క్షాల మ‌ధ్య పెద్ద ఎత్తున వాగ్వాదాలు జ‌రుగుతుండ‌టం మ‌నం చూస్తున్న‌దే. ఈ క్ర‌మంలో కోపం ప‌ట్ట‌లేని కొంత‌మంది స‌భ్యులు త‌మ ముందు ఉన్న మైకుల‌తో పాటు స్పీక‌ర్ ముందు ఉన్న మైకుల‌ను కూడా విరిచివేస్తూ నానా ర‌భ‌స చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ, మండ‌లి భ‌వ‌నాల్లో ఇక‌పై ఈ మైకులు విర‌వ‌డాలు ఏమాత్రం క‌నిపించ‌వు. ఎందుకంటే... సాధార‌ణ మైకులు ఇక్క‌డ క‌నిపించ‌వు. జ‌పాన్‌కు చెందిన బాయ‌ర్ కంపెనీ రూపొందించిన ఆడియో సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేసిన అధికారులు... స‌భ్యుల టేబుళ్ల‌పై మైకుల‌కు బ‌దులు వాయిస్ రిసీవ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఓ చిన్న‌పాటి టైప్ రైట‌ర్‌లా క‌నిపించే ఈ ప‌రిక‌రం... టేబుల్ కు అతుక్కునే ఉంటుంది. దీనిని విరిచిపారెయ్య‌డం అంత ఈజీ కాద‌ట‌. అంటే... ఇక‌పై స‌భ‌లో మైకులు విరిచి విసిపిపారేసే ఘ‌ట‌న‌లు మ‌న‌కు క‌నిపించ‌వ‌న్న మాట‌.

ఈ భ‌వ‌నాలకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల్లోకెళితే.. ఒకే సముదాయంలోనే అసెంబ్లీ, శాస‌నమండ‌లిల‌ను ఏర్పాటు చేశారు. అఅసెంబ్లీని మొత్తం 260 మంది కూర్చునేలా నిర్మించారు. 90 మంది కూర్చునేలా శాసనమండలిని నిర్మించారు. అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను అత్యంత ఆకర్షణీయంగా తయారు చేశారు. ఏడు అడుగుల ఎత్తులో స్పీకర్ ఛైర్ ను ఏర్పాటు చేశారు. స్పీకర్ ఛైర్ కు ఇరువైపులా ఎల్ఈడీ స్కీన్స్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో ఐదు అత్యాధునిక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీటిలో మీడియాకు 2, అధికారులు, వీఐపీలకు, విజిటర్స్ కు ఒక్కో గ్యాలరీ కేటాయించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/