Begin typing your search above and press return to search.

అర్జంటుగా విశాఖకు చంద్రబాబు.... ఏం జరగనుంది... ?

By:  Tupaki Desk   |   3 Nov 2021 8:30 AM GMT
అర్జంటుగా విశాఖకు  చంద్రబాబు.... ఏం జరగనుంది... ?
X
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ వచ్చి చాలా నెలలే అయింది. ఆయన లోకల్ బాడీ ఎన్నికల వేళ వచ్చారు. ఆ తరువాత కరోనా రెండవ దశ ఉధృతం కావడంతో బాబు ఈవైపు రాలేకపోయారు. ఈ మధ్యనే బాబు జిల్లాల టూర్లు మొదలెట్టారు. మంగళగిరిలో దీక్షకు కూర్చున్న తరువాత ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేశారు. అదే విధంగా తన సొంత నియోజక‌వర్గం కుప్పంలో కూడా బాబు రెండు రోజుల పాటు పర్యటించారు. ఇపుడు బాబు చూపు విశాఖ మీద ఉందిట. అర్జంటుగా విశాఖకు రావాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా.

విశాఖ వచ్చి చాలా కాలం అయింది. దాంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఉద్యమం కొనసాగుతోంది. దాన్ని మరింతగా రాజేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇపుడు చంద్రబాబు తన వంతు అంటున్నట్లుగా తెలుస్తోంది. సరైన సమయం చూసుకుని అంటే దీపావళి తరువాత బాబు విశాఖ టూర్ ఉంటుంది అంటున్నారు. ఈ మధ్యనే పార్టీ నాయకులు కూడా కొంతమంది బాబుని కలసి విశాఖ రావాలని కోరారు. అదే విధంగా కొన్ని రోజుల పాటు ఉండి కీలకమైన నియోజకవర్గల్లో బాబు పర్యట‌నలు చేయాలని కూడా వారు అడిగినట్లుగా సమాచారం.

బాబు సైతం దానికి అంగీకరించారట. ఇంతలో పవన్ విశాఖ టూర్ ఖరారు కావడం, ఆయన బాంబుల్లాంటి కామెంట్స్ తో వైసీపీ మీద విరుచుకుపడడంతో తాను కూడా ఇక విశాఖ కచ్చితంగా రావాల్సిందే అని బాబు భావిస్తున్నారుట. బాబు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించారు. ఇపుడు మరోసారి ఆయన అక్కడకు వెళ్ళి వారితో కూర్చుని ఉద్యమానికి మద్దతు ఇస్తారట. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కావడం వెనక వైసీపీ సర్కార్ ఉదాశీనతే ఉందని బాబు కూడా ఘాటు విమర్శలు చేస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ని కార్నర్ చేయడంతో పాటు ఇదే ఇష్యూతో విశాఖలో రాజకీయ వేడిని రగిలించాలని చంద్రబాబు పక్కాగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరి బాబు విశాఖ టూర్ ఎన్ని సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాల్సిందే.