Begin typing your search above and press return to search.
తన స్ధాయిని తానే తగ్గించేసుకుంటున్న చంద్రబాబు
By: Tupaki Desk | 20 Dec 2020 5:15 AM GMTఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు తన స్ధాయిని తానే తగ్గించేసుకుంటున్నారు. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందిచేస్తుండటంతోనే అందరికీ పలుచనైపోతున్నారు. ప్రతిరోజు మీడియాలో కనబడాలన్న తాపత్రయమే చంద్రబాబుకు చెడ్డపేరు తచ్చేస్తోంది. వైజాగ్ లో ఓ పోలీసు-వైసీపీ కార్యకర్త మద్య జరిగిన విషయమే ఇందుకు తాజా నిదర్శనం.
వైజాగ్ టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ ఆఫీసు దగ్గర ఓ పోలీసుపై వైసీపీ కార్యకర్త దౌర్జన్యం చేశాడంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పెద్ద ఆరోపణ చేసేశారు. తన ఆరోపణకు ఆధారంగా ఓ ఫొటోను కూడా ట్యాగ్ చేశారు. ఇంకేముంది తమ అధినేతే ఆరోపణలు చేసేపుడు తామెందుకు చేయకూడదని అదే ఫొటోను నారా లోకేష్ తో పాటు పార్టీ నేతలంతా ట్విట్టర్లో పెట్టేసి ఒకటే గోల చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే వెలగపూడి ఆఫీసు దగ్గరున్న పోలీసును అటువైపు వచ్చిన ఓ ఆటో ఢీ కొట్టేసింది. దాంతో పోలీసు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో అటువైపు వచ్చిన వైసీపీ కార్యకర్త ఆ విషయం చూసి వెంటనే కిందపడిన పోలీసును పైకి లేపారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఎవరో వీడియో, ఫొటోలు తీశారు. తీసిన ఫొటో, వీడియోలను టీడీపీకి పంపారు. దాంతో అసలే ప్రభుత్వంపై రెచ్చిపోవటానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు కదా. అందుకనే వీడియో, ఫొటో చూడగానే చంద్రబాబు రెచ్చిపోయారు.
చంద్రబాబు ట్విట్టర్లో వచ్చిన కామెంట్లు చూసిన పోలీసు శాఖ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే జరిగిన ఘటనను సదరు పోలీసు తన సహచరులకు చెప్పటంతో అసలు విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబు ట్విట్టర్లో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా రావటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఆటో కారణంగా దెబ్బతిన్న పోలీసే తర్వాత మీడియాకు జరిగిందేమిటో చెప్పినా చంద్రబాబు+నారాలోకేష్+టీడీపీ నేతలు మాత్రం ఒప్పుకోవటం లేదు.
ఆమధ్య గుంటూరు జిల్లాలో పోలీసులు పేకాటాడుకుంటున్నారంటూ చంద్రబాబు ఓ ట్విట్ పెట్టి కామెంట్ చేశారు. తర్వాత అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఆ ఫొటో మన రాష్ట్రంలోది కాదు. ఒడిస్సాలో ఎక్కడో పోలీసులు పేకాటాడుకుంటున్నారు. అక్కడెక్కడి ఫోటోను తెచ్చి గుంటూరులోదని చంద్రబాబుకు చెప్పేస్తే వెంటే వెనకాముందు చూసుకోకుండా వెంటనే ట్విట్టర్లో పెట్టేసి నవ్వులపాలయ్యారు. అసలు ఇటువంటి విషయాలపై చంద్రబాబు స్ధాయి వ్యక్తి స్పందించటం అవసరమా ? అని టీడీపీలోనే మాట్లాడుకుంటున్నారు.